రాంచరణ్, కాజల్ హీరో, హీరోయిన్లుగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’. శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ, ప్రకాష్ రాజ్, జయసుధ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ‘పరమేశ్వర ప్రొడక్షన్స్’ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మించాడు. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు.2014వ సంవత్సరం అక్టోబర్ 1న ఈ చిత్రం విడుదలయ్యింది.అంటే నేటితో ఈ చిత్రం విడుదలై 7ఏళ్ళు పూర్తికావస్తోందన్న మాట. ఓపెనింగ్స్ అయితే బాగానే వచ్చాయి కానీ.. తర్వాత ఈ సినిమాని ప్రేక్షకులు పట్టించుకోలేదు.
‘అత్తారింటికి దారేది’ లైన్ ని కృష్ణవంశీ ‘మురారి’ ‘చందమామ’ స్టయిల్లో తీసినట్టు ఉంది అంటూ ప్రేక్షకులు పెదవి విరిచారు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం షూటింగ్ ను అతి కష్టం మీద కంప్లీట్ చేసాడు దర్శకుడు కృష్ణవంశీ అన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు. చిత్రీకరణ సమయంలో ఎన్నో మార్పులు కూడా చోటుచేసుకున్నాయి. బండ్ల గణేష్ బ్యానర్ లో చరణ్ సినిమా అనగానే మొదట కొరటాల శివని దర్శకుడిగా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన కొరటాల తప్పుకోవడం కృష్ణవంశీ లైన్లోకి రావడం జరిగాయి.
తర్వాత ‘గోవిందుడు అందరి వాడేలే’ లో శ్రీకాంత్ పాత్రకి ఓ స్టార్ హీరోని అనుకున్నారు. అతను మరెవరో కాదు వెంకటేష్. కానీ ఈ పాత్ర తన ఇమేజ్ కు సూట్ అయ్యే విధంగా లేదని భావించి తప్పుకున్నాడు వెంకీ మామ. అటు తర్వాత తాత పాత్రకి తమిళ నటుడు రాజ్ కిరణ్ ను అనుకున్నారు. కొంతభాగం షూటింగ్ అయ్యాక అతను కూడా తప్పుకున్నాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా ముందుగా తమన్ ను అనుకున్నారు. కారణాలేంటో తెలీదు కానీ అతను కూడా తప్పుకోవడం యువన్ శంకర్ రాజా వచ్చి చేరడం జరిగింది.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!