దర్శకధీరుడు రాజమౌళి సినిమా సినిమాకీ దర్శకుడిగా ఒక్కోమెట్టు ఎక్కడమే కాక తెలుగు సినిమా సత్తాని.. తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు.. ఏళ్ల తరబడి ఊహించడానికే కష్టం అనుకున్న తెలుగు సినిమాకి, ఇండియాలోనే మొట్ట మొదటి ఆస్కార్ అవార్డ్ తెచ్చిపెట్టారు.. 95వ అకాడమీ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో ‘నాటు నాటు’ ఆస్కార్ కైవసం చేసుకుంది..
అయితే దీని కోసం ‘ఆర్ఆర్ఆర్’ టీం.. ముఖ్యంగా రాజమౌళి అండ్ ఫ్యామిలీ ఎంతో కృషి చేశారు.. కోటాను కోట్లు ఖర్చు పెట్టి దేశ విదేశాల్లో సినిమాను ప్రదర్శించి.. కమిటీ దృష్టిలో పడేలా చేశారు.. రామ్ – భీమ్ కూడా అక్కడి మీడియాతో, అభిమానులతో, సినీ ప్రముఖులతో ఇంటరాక్ట్ అయ్యారు.. పలు టీవీ షోలలోనూ పాల్గొన్నారు.. వారిచేత ఎంత వరకు చేయించాలో అంత ప్రమెషనూ చేయించారు..
ఇక అవార్డ్స్ కార్యక్రమంలో అందరూ ట్రెడిషనల్ డ్రెస్సెస్‌లో మెరిసిపోయారు.. రామ్ చరణ్ బ్లాక్ డ్రెస్‌లో స్టైలిష్‌గా కనిపించాడు.. అదే సమయంలో తన చేతికున్న వాచ్ హైలెట్‌గా కనిపించింది. ఫ్యాన్స్ సైలెంట్‌గా ఉండరు కదా.. నెట్‌లో దాని వివరాలు వెతికారు.. చెర్రీ పెట్టుకున్న వాచ్.. Patek Phillipe Nautilus Travel Time (5980/1R) – దీని ధర అక్షరాలా రూ. 89, 57,963/- (108,820 డాలర్స్)..
ఇక ఇండియా తిరిగొచ్చిన తర్వాత ట్రిపులార్ టీంని పార్లమెంట్‌లో సన్మానించాలని సన్నాహాలు చేస్తున్నారు.. ఈ సందర్భంగా చరణ్ అరుదైన గౌరవం అందుకోబోతున్నాడు.. భారతదేశానికి వచ్చిన కొన్నిరోజులకే న్యూఢిల్లీలో జరగబోయే ఇండియా టుడే కాన్ క్లేవ్‌లో చరణ్ పాల్గొనబోతున్నాడు.. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ఈ ఈవెంట్‌కు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానుండడం విశేషం.. న్యూఢిల్లీలో ఈనెల 17,18 తేదీల్లో జరగబోతున్న ఈ ఈవెంట్‌లో ప్రధాని మోదీతో పాటు క్రికెట్ దిగ్గజం సచిన్ కూడా పాల్గొనబోతున్నారు.. మన తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచం నలుమూలల చాటి చెప్పినందుకుగాను ఈ వేదిక మీద రామ్ చరణ్‌ని ప్రధాని మోదీ సన్మానించబోతున్నారని తెలుస్తోంది..
రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!
2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్