Upasana: ప్రెగ్నెన్సీ విషయంలో మా ఫ్యామిలీ ఒత్తిడి చేయలేదు!

మెగా కోడలు ఉపాసన ప్రస్తుతం గర్భిణీ అనే విషయం మనకు తెలిసిందే. మరికొద్ది నెలలో ఈమె పండంటి బిడ్డకు జన్మనివ్వ బోతున్నారు. ఇలా ఉపాసన రాంచరణ్ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న నేపథ్యంలో అభిమానులు మెగా కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.దాదాపు పది సంవత్సరాలుగా ఈ శుభవార్త ఎప్పుడు చెబుతారా అని ఎదురుచూస్తున్నటువంటి అభిమానులకు నిజంగానే ఇది పండగ లాంటి వార్త అని చెప్పాలి. రామ్ చరణ్ ఉపాసన ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పది సంవత్సరాలు క్రితం ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

వీరి వివాహమైనప్పటి నుంచి ఎంతోమంది పిల్లల గురించి ఉపాసనను పలుమార్లు ప్రశ్నించారు.అయితే ఇది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన సమయంలోనే తాను చెబుతాను అంటూ ఈ ప్రశ్నను దాటివేశారు. ఉపాసన ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ తన ప్రెగ్నెన్సీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. త్వరలోనే అమ్మను కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని తన సంతోషాన్ని తెలియజేశారు.

ఈ సమాజం కోరుకున్నట్టు కాకుండా మాకు నచ్చినట్టు మేము పేరెంట్స్ కాబోతున్నామని తెలియజేశారు.10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మాకు పిల్లలు ఉంటే బాగుంటుంది అనిపించింది పిల్లలను ప్లాన్ చేయడానికి ఇదే బెస్ట్ టైం అనిపించి పిల్లలను ప్లాన్ చేసుకున్నామని తెలిపారు.ఇప్పుడు మాకు పూర్తి ఆర్థిక భద్రత ఉంది. ఇద్దరం ఆర్థికంగా బాగా సెటిల్ అయిన తరువాతనే పిల్లలని ప్లాన్ చేయాలని నిర్ణయం తీసుకున్నాము.

ఇది పరస్పర అంగీకారంతో జరిగింది. ఇప్పుడు మేము (Upasana) మా పిల్లలను బాగా చూసుకోగలము. ఇక మాకు పిల్లలు కావాలి అంటూ మా కుటుంబం మాపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని అలాంటి ఒత్తిడిని మా వరకు రానివ్వకుండా జాగ్రత్త పడ్డాము అంటూ ఈ సందర్భంగా ఉపాసన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus