‘RRR’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు “గ్లోబల్ స్టార్” ట్యాగ్‌తో సినిమాలు చేస్తూ తన క్రేజ్‌ను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో శంకర్ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న “గేమ్ ఛేంజర్”(Game Changer) పై భారీ అంచనాలుండటం సహజం. అయితే, సినిమా విడుదల సమీపిస్తున్నా, ఆశించినంతగా సోషల్ మీడియాలో సందడి కనిపించడం లేదు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు గ్రాండ్ గా విడుదలయ్యాయి.
“జరగండి,” “రా మచ్చా మచ్చా,” “నానా హైరానా” పాటలు సినిమాపై పెద్దగా క్రేజ్ తీసుకురాలేకపోయాయి. ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) – ‘దేవర’ లాంటి సినిమాల హైప్‌ను టచ్ చేయలేకపోవడం గమనార్హం. అమెరికాలో ప్రీమియర్ షోల కోసం అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైనా, ఇప్పటివరకు వచ్చిన నంబర్లు ఆశాజనకంగా లేవని ట్రేడ్ వర్గాలు చెప్పుతున్నాయి. ఇతర సంక్రాంతి చిత్రాలు, ముఖ్యంగా వెంకటేశ్ నటిస్తున్న “సంక్రాంతికి వస్తున్నాం” (Sankranthiki Vasthunnam) మంచి స్పందన పొందుతుండటం, అలాగే బాలకృష్ణ (Nandamuri Balakrishna) ”డాకు మహారాజ్” (Daaku Maharaaj) ప్రమోషన్స్ జోరుగా సాగుతుండటం గేమ్ ఛేంజర్‌కు కాస్త పోటీగా మారింది.
‘డాకు మహారాజ్’ ఫస్ట్ సింగిల్‌కి వచ్చిన రెస్పాన్స్ గేమ్ ఛేంజర్‌పై మరింత ఒత్తిడిని తెచ్చింది. అయితే, గేమ్ ఛేంజర్ టీమ్ ప్రీమియం ప్రమోషన్ ప్లాన్స్‌ను అమలు చేయబోతున్నట్లు సమాచారం. డల్లాస్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేయడం, నాలుగో పాట “ధోప్” విడుదలతో పాటు, నెలాఖరులో థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేయడం ద్వారా ప్రేక్షకుల అంచనాలను పెంచాలని చూస్తున్నారు.
ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను రాజమండ్రిలో నిర్వహించాలని, పవన్ కళ్యాణ్‌ను (Pawan Kalyan) చీఫ్ గెస్టుగా ఆహ్వానించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక శంకర్ మార్క్ కు తగ్గట్లే, గేమ్ ఛేంజర్ టెక్నికల్‌గా గర్వించదగిన సినిమా కావడం ఖాయం అని చెబుతున్నారు. కానీ, భారీ బడ్జెట్‌కు తగిన స్థాయిలో బజ్ పెంచాలంటే, టీమ్ మరింత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది. సంక్రాంతి రిలీజ్ దగ్గరపడుతున్న తరుణంలో గేమ్ ఛేంజర్ పోటీలో నిలవాలంటే రాబోయే ప్రమోషన్ల సౌండ్ ఇంకా గట్టిగా ఉండాలి.