విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రస్తుతం గౌతం తిన్ననూరి (Gowtam Tinnanuri) డైరెక్షన్‌లో కొత్త సినిమాతో బిజీగా ఉన్నాడు. గతంలో విజయ్ నటించిన సినిమాలు యువతలో అతనికి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి. కానీ ఈ మధ్య విడుదలైన ఫ్యామిలీ డ్రామా ఆశించిన ఫలితాన్ని అందించలేదు. ఈ నేపథ్యంలోని కొత్త సినిమాపై, విజయ్ ఫ్యాన్స్ లో అంచనాలు పెరుగుతున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో, భాగ్య శ్రీ బోర్స్ ను హీరోయిన్ గా కనిపించనుంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.
సినిమా షూటింగ్ మొదలై కొన్ని నెలలు అవుతున్నా, ఇప్పటి వరకు టీం నుండి ఎలాంటి అప్‌డేట్స్ రాలేదు. లీక్ అయిన ఫోటోల్లో విజయ్ కొత్త లుక్ తో కనిపించగా, చిన్న హెయిర్ కట్ తో అతని గెటప్ విభిన్నంగా ఉంది. 2025 మార్చి 28, విడుదలకు ప్లాన్ చేసిన ఈ చిత్రం, భారీ పోటీ ఉండనున్న ఏడాదిలో తనదైన గుర్తింపును సాధించబోతున్నట్లు కనిపిస్తోంది.
అయితే ఇప్పటి వరకు టైటిల్ టీజర్ లేదా పోస్టర్ విడుదల చేయకపోవడం ఫ్యాన్స్‌ను కొంత అసంతృప్తికి గురి చేస్తోంది. ఈ చిత్రం పూర్తిగా విజయ్ అభిమానులను ఉద్దేశించి డిజైన్ చేయబడినట్లు తెలుస్తోంది. కథ, యాక్షన్ సీక్వెన్సులు, విజయ్ అభిమానులు కోరుకునే మాస్ ఎలిమెంట్స్ అన్ని సినిమాలో ఉంచినట్లు వినిపిస్తోంది.
టీజర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నా, క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ కానుకగా ఫస్ట్ లుక్ విడుదల చేసి సినిమాపై బజ్ పెంచాలని టీం ప్రణాళికలు రచిస్తున్నట్లు టాక్ ఉంది. విజయ్ దేవరకొండ, ఈ చిత్రంతో పాటు రవికిరణ్(Ravi Kiran Kola), రాహుల్ సంకృత్యన్‌లతో (Rahul Sankrityan) కూడా ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టాడు. రౌడీ స్టార్ గా (Vijay Deverakonda) తన మార్క్ మరింత ఎలివేట్ చేయడం లక్ష్యంగా విజయ్, వరుసగా క్రేజీ సినిమాలను సెలెక్ట్ చేస్తూ తన బిజీ షెడ్యూల్‌ను కొనసాగిస్తున్నాడు.