అవతార్ 2 సినిమా పై ఇంట్రేసింగ్ కామెంట్స్ చేసిన ఆర్జీవీ… ఏమన్నారంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాస్పద దర్శకుడిగా గుర్తింపు పొందిన రాంగోపాల్ వర్మ గురించి తెలియని వారంటూ ఉండరు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వివాదాల్లో నిలిచే రాంగోపాల్ వర్మ అవతార్ 2 సినిమా గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా విడుదలైన అవతార్ 2 సినిమా ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటుంది. జేమ్స్ కామెరున్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో విడుదలై సినీ ప్రముఖుల ప్రశంసలు దక్కించుకుంటుంది.

ఈ సినిమా చూసిన పలువురు సెలబ్రిటీలు ఈ సినిమా బృందాన్ని పొగడ్తలతో ముంచేత్తుతున్నారు. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా అవతార్ 2 సినిమా వీక్షించాడు. అవతార్- ది వే ఆఫ్ వాటర్ పై సినిమాపై రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ… ఈ సినిమాలో ప్రతి సన్నివేశం మనసును హత్తుకునేలా ఉందనీ వెల్లడించారు. దేవుడు మనం నివసించే ఈ విశ్వాన్ని సృష్టిస్తే కామెరున్ “పండోరా” అనే ఒక అద్భుత ప్రపంచాన్ని సృష్టించాడు అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ సినిమాలో అద్భుతమైన విజువల్స్, ఆకట్టుకునే ప్రదర్శన , ఓపెనింగ్ బిగబట్టేలా ఉండే యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా అద్భుతంగా ఉంది అంటూ వెల్లడించాడు. జేమ్స్ కామెరున్ సృష్టించిన పండోర అనే ఈ అద్భుత ప్రపంచంలో జీవించాలని ఉందని అన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత స్వర్గం అంటే ఇలానే ఉంటుందని చెబితే మనుషులు అందరూ ఇప్పుడే చనిపోతారు అంటూ చెప్పుకొచ్చాడు.

2009లో విడుదలైన అవతార్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లు రాబడుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు దర్శకుడు జేమ్స్ కామెరున్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus