వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’, ‘కేజీఎఫ్2’ సినిమాలు భారీ విజయాలను అందుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో కూడా ఈ సినిమాలు సత్తా చాటాయి. దీంతో ఆర్జీవీ బాలీవుడ్ సినిమాలను తక్కువ చేస్తూ కొన్ని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి బాలీవుడ్ ని టార్గెట్ చేశారాయన. థియేటర్లలో సౌత్ సినిమాలు సక్సెస్ సాధించడం, నార్త్ సినిమాలు పరాజయం పొందడం చూస్తుంటే..
త్వరలోనే బాలీవుడ్ కేవలం ఓటీటీల కోసం సినిమాలను తెరకెక్కించే పరిస్థితి కనిపిస్తోంది అంటూ ట్వీట్ చేశారు వర్మ. దీంతో ఈ వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ఈ విషయం పక్కన పెడితే.. రీసెంట్ గా ఓ టీవీ షోలో పాల్గొన్న వర్మ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా..? అనే ప్రశ్నకు స్పందించిన వర్మ.. ఒకవేళ తను ఎన్నికల్లో నిలబడితే బుద్ధి ఉన్నవాళ్లెవరూ తనకు ఓటేయ్యరని, ఎందుకంటే తను జనాలకు ఏం చేయననే విషయం వారికి బాగా తెలుసని అన్నారు.
తనకోసం తను బతుకుతానని.. రాజకీయనాయకుల లక్షణం అది కాదని అన్నారు. ఆ తరువాత తనలా బతకాలంటే మూడు విషయాలను ఫాలో అవ్వాలని చెప్పారు. అవేంటంటే.. దేవుడు, సమాజం, కుటుంబం వంటి మూడు అంశాలను వదిలేయాలని.. అప్పుడు వచ్చే స్వేచ్ఛతో తనలా బతకొచ్చని వర్మ వ్యాఖ్యానించారు. ఇక రీసెంట్ గా వర్మ డైరెక్ట్ చేసిన ‘మా ఇష్టం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లెస్బియన్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా వర్మ లిస్ట్ లో మరో ఫ్లాప్ గా నిలిచింది.
Most Recommended Video
10 ఏళ్ళ ‘గబ్బర్ సింగ్’ గురించి 12 ఆసక్తికరమైన విషయాలు..!
‘చెల్లమ్మ’ టు ‘మ మ మహేషా’.. జోనిత గాంధీ పాడిన 10 సూపర్ హిట్ పాటల లిస్ట్..!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు..!