RGV Dance: హీరోయిన్ తో కలిసి సిగిరెట్ తాగుతూ వర్మ హడావిడి.. పోస్ట్ వైరల్..!

రాంగోపాల్ వ‌ర్మ‌.. అంటే సెన్సేషన్… సెన్సేషన్ అంటే రాంగోపాల్ వర్మ. సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటాడు రాంగోపాల్ వర్మ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.దేనికీ లొంగడు… దేనికీ భయపడడు.ఇంకా చెప్పాలంటే దేనినీ లెక్క చే యడు.ఒకప్పుడు పూరీ జగన్నాథ్ వంటి స్టార్ డైరెక్టర్లు మరియు తన శిష్యులతో తిరుగుతూ వచ్చిన వర్మ… ఈ మధ్య కాలంలో శ్రీకాంత్ అయ్యంగర్,జ్యోతి, అషు రెడ్డి వంటి ఆర్టిస్ట్ లతో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ వస్తున్నాడు.

సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక ఇంట్రెస్టింగ్ మరియు షాకింగ్ ఫొటోలతో దర్శనం ఇస్తూనే ఉంటాడు. తాజాగా ఓ హీరోయిన్‌తో పబ్ లో డ్యాన్స్‌లు చేస్తూ సిగిరెట్లు కాలుస్తూ హడావిడి చేసాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘నన్ను ద్వేషించే వారు.. నన్ను అభిమానించేవారు క్యాప్షన్లు ఇచ్చుకోవచ్చు’ అంటూ కొన్ని కామెంట్లు కూడా పెట్టాడు వర్మ.అంతేకాదు ‘బెస్ట్ క్యాప్షన్’ పెట్టిన వారికి ఒక రూ.1 లక్ష బహుమతి కూడా అందజేయబడును అన్నట్టు ‘ కామెంట్ చేసాడు వర్మ.

అయితే కాసేపటికి ఆ ట్వీట్ ను ట్విట్టర్ నుండీ తొలిగించడం జరిగింది. ఇక ఈ పోస్ట్ కు ట్రోలింగ్ చేసే బ్యాచ్ చాలా మంది ఉన్నారు.వాటిని వర్మ లెక్క చేయడు కదా..! పైగా ఆయన ఆశించేదే అది.మరి ఆయన కోరుకున్నది జరిగితే సక్సెస్ అయితే ఆయన హ్యాపీనే కదా..! మరో పక్క ఆయన రూపొందిస్తున్న ‘కొండా’ మూవీ ప్రమోషన్లలో కూడా చురుగ్గా పాల్గొంటున్నాడు. ఈ మధ్యనే ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.దానికి మంచి స్పందనే లభించింది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus