“శివ” సినిమా చూసి చాలా మంది యువకులు సైకిల్ చైన్లు తెంపడానికి ప్రయత్నించి చేతులు తెగ్గొట్టుకొన్న దాఖలాలు ఉన్నాయి. అదే తరహాలో దర్శకుడు వర్మ తెరకెక్కించిన కళాఖండాలు చూసి మర్డర్స్ ఎలా చేయాలో నేర్చుకోన్నాడట ఓ మహానుభావుడు.
నెల్లూర్లో అయిదు మర్డర్లు చేసిన సైకో వెంకటేష్ గురించి వినే ఉంటారు. అతడలా సైకోలా ఎందుకు మారాడో తెలియదుగానీ.. మర్డర్లు మాత్రం రాంగోపాల్ వర్మ తీసిన ఫ్యాక్షన్, సైకో థ్రిల్లర్ సినిమాలు చూసి నేర్చుకొన్నాడట. సినిమాల ప్రభావం జనాల మీద ఉంటుంది అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఉంటుందా చెప్పండి.