దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కరోనా సోకిందంటూ వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజులుగా కరోనా వైరస్ పై సెటైర్స్ వేస్తూ కాలక్షేపం చేస్తున్న వర్మకు కరోనా రావడం ఆశ్చర్యకర సంగతి,. ఇటీవలే రాజమౌళికి మరియు ఆయన కుటుంబానికి కరోనా సోకితే వర్మ బాహుబలిని పంపితే కరోనాను చంపేస్తాడు అని సెటైర్ వేశారు. వర్మ వాస్తవసంఘటనల ఆధారంగా మardar అనే మూవీ తెరకెక్కిస్తున్నాడు. రెండేళ్ల క్రితం మిర్యాలగూడలో జరిగిన ఓ పరువు హthya ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుండగా, ఆ వాస్తవ ఘటనలో బాధితురాలిగా ఉన్న అమృత ప్రణయ్ కోర్టుకు ఎక్కారు.
తమ కేసు విచారణలో ఉండగా ఈ మూవీ రావడం వలన సాక్షులు ప్రభావితం అవుతారని అమృత నల్గొండ ఎస్ సి, ఎస్ టి కోర్టులో పిటీషన్ వేయడం జరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా నేడు వర్మ మరియు చిత్ర నిర్మాతలు కొందరు కోర్ట్ కి హాజరు కావాల్సివుంది. ఐతే వర్మ తరపు లాయర్, ఆయనకు కరోనా సోకడం వలన కోర్ట్ కి హాజరుకాలేక పోయారని, కోర్ట్ లో వెల్లడించడం జరిగింది. దీనితో వర్మకు కరోనా సోకిందని, అందరూ భావించారు. ఐతే వర్మ ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు.
తనకు కరోనా సోకినట్లు వచ్చిన వార్తలలో ఎటువంటి నిజం లేదు అన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని తెలిపారు. అలాగే తన నెక్స్ట్ రిలీజ్ థ్రిల్లర్ లో నటించిన హీరోయిన్ అప్సరా రాణితో లైవ్ లోకి రానున్నట్లు తెలియజేశారు. ఇక థ్రిల్లర్ మూవీ ఆర్ జి వి వరల్డ్ థియేటర్ లో ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ మూవీ టికెట్ ధరగా 200 రూపాయలుగా నిర్ణయించారు. ఇక టికెట్ బుక్ చేసుకున్న వారిలో లక్కీ విన్నర్స్ వర్మ మరియు హీరోయిన్ అప్సర రాణితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కలదని చెప్పడం విశేషం.
Most Recommended Video
‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ హీరోయిన్ రూప గురించి మనకు తెలియని విషయాలు..!
పోకిరి మూవీలో పూరిజగన్నాథ్ సోనూసూద్ నీ హీరోగా అనుకున్నాడట!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?