RGV: ఓటీటీల వల్ల ఇండస్ట్రీకి ఏమీ నష్టం లేదు!

  • August 2, 2022 / 06:23 PM IST

రాంగోపాల్ వర్మ తాను ఏ విషయంలోనైనా విభిన్నమని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ ఉంటారు.ఈ క్రమంలోనే అంతా ఒకవైపు అయితే తాను మాత్రం మరో వైపు అన్నట్టు ప్రతి విషయంలోనూ వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చలు గురించి మనకు తెలిసిందే. ఓటీటీల కారణంగా ఇండస్ట్రీకి పెద్ద ఎత్తున నష్టం ఏర్పడుతుందని నిర్మాతలు సినిమాలను థియేటర్లో విడుదల చేసిన తర్వాత ఆలస్యంగా డిజిటల్ మీడియాలో ప్రసారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై రాంగోపాల్ వర్మ స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ప్రస్తుతం నిర్మాతలు అందరూ కూడా సినిమాలను తొందరగా ఓటీటీలలో విడుదల చేయటం వల్ల థియేటర్ కు వచ్చి సినిమాలను చూసే వారి సంఖ్య తగ్గిపోయిందని అందుకోసమే ఆలస్యంగా సినిమాలు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ విషయంపై వర్మ స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలైన స్విగ్గి జొమాటోలను హోటల్ నిర్వాహకులు, యాజమాన్యాలు బ్యాన్ చేయాలని అంటే ఎలా ఉంటుందో నిర్మాతలు కూడా ఓటీటీలను బ్యాన్ చేయమని చెప్పడం అలాగే ఉంది అంటూ ఈయన వెల్లడించారు.

ఫుడ్ డెలివరీ యాప్ వల్ల హోటళ్లకు అధిక లాభాలు వస్తున్నాయి. అదే విధంగా ఓటీటీల వల్ల కూడా ఇండస్ట్రీకి లాభాలు వస్తున్నాయని తెలిపారు. ఓటీటీల వల్ల సినిమా ఇండస్ట్రీకి నష్టం వస్తుందనడం సరికాదని వర్మ వెల్లడించారు. ఒక సినిమాని చక్కగా తెరకెక్కిస్తే ప్రతి ఒక్కరు తప్పకుండా థియేటర్ కి వస్తారని,థియేటర్లో చూడటం ఆసక్తి లేనివారు ఎప్పటికీ థియేటర్ కి వచ్చే సినిమాలు చూడరని ఈయన పేర్కొన్నారు.

ఇలా థియేటర్లో సినిమా చూడటానికి ఆసక్తి చూపని వారు సినిమాని ఎప్పుడు ఓటీటీలలో, టీవీలలో ప్రసారం చేసిన చూస్తారు కానీ థియేటర్ కి మాత్రం రారని ఈయన వెల్లడించారు.మరి వర్మ చేసిన ఈ వ్యాఖ్యలపై నిర్మాతలు ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus