RGV: మరో పొలిటికల్‌ బయోపిక్‌కి వర్మ రెడీ…!

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్‌ బ్రాండ్ అనే పేరున్న రాజకీయ నాయకుల్లో కొండా దంపతులు ఒకరు. తమ మార్కు రాజకీయాలతో ఎప్పుడూ టాక్‌ ఆఫ్‌ ది పాలిటిక్స్‌గా నిలుస్తూ ఉంటారు. వారి జీవితంలో సినిమా తీయడానికి కావాల్సినంత స్టఫ్‌ ఉంది అంటుంటారు వరంగల్‌ వాసులు. ఈ మాట ఆ నోట, ఈ నోట పడి… రీసెంట్‌ రామ్‌గోపాల్‌ వర్మ వరకు వెళ్లిందట. ఇంకేముంది బయోపిక్‌ అంటూ వర్మ ఇప్పుడు వరంగల్‌ టూర్‌ వేశారని తెలుస్తోంది. అన్నీ కుదిరితే సినిమా పక్కా అంటున్నారు.

వరంగల్‌లో కొండా దంపతులు కొండా సురేఖ, మురళికి రెబల్‌ లీడర్స్‌ అని పేరు. ముందుగా చెప్పినట్లుగా ఏ పార్టీలో ఉన్నా… తమదైన రాజకీయం చేస్తుంటారు. అలాంటి వారి మీద సినిమా కోసం వర్మ ఇప్పటికే వరంగల్‌ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారట. కొండా మురళి చదువుకున్న కాలేజీలు, కొండా సురేఖతో పెళ్లి, ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ, ఎదిగిన తీరు లాంటి విషయాలను వర్మ అక్కడి వారి నుండి అడిగి తెలుసుకుంటున్నారట.

వరంగల్ రాజకీయాల్లో కొండా దంపతుల ముద్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే కొండా మురళిపై అదే స్థాయిలో ఆరోపణలు, విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో ఆయన భార్య కొండా సురేఖను ప్రత్యక్ష రాజకీయాల్లో పెట్టి… ఆయన పరోక్ష రాజకీయాల్లో ఉంటున్నారని అంటుంటారు. కాంగ్రెస్‌ నుండి జగన్‌ టీమ్‌లోకి చేరి… తిరిగి అక్కడి టీఆర్‌ఎస్‌కు వచ్చారు కొండా దంపతులు. ఆ తర్వాత నాటకీయ పరిణామాల మధ్య ఇప్పుడు కాంగ్రెస్‌లోకి చేరారు. మరి ఇప్పుడు వర్మ తన సినిమాలో ఏం చూపిస్తారో చూడాలి.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus