Mahesh Babu: సర్కారు వారి పాట ఫైట్ సీన్ వెనుక ఇంత కథ ఉందా?

స్టార్ హీరో మహేష్ బాబుకు మాస్ ప్రేక్షకులతో పాటు క్లాస్ ప్రేక్షకులలో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సర్కారు వారి పాట సినిమాకు ఫస్ట్ వీకెండ్ వరకు బుకింగ్స్ బాగానే ఉన్నాయి. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా మహేష్ ఫ్యాన్స్ మాత్రం గతంలో మిక్స్డ్ టాక్ వచ్చిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయని చెబుతున్నారు. సోమవారం నాటికి సర్కారు వారి పాట ఫైనల్ స్టేటస్ తేలనుంది.

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కమర్షియల్ అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. మహేష్, కీర్తి సురేష్, పరశురామ్, ఈ సినిమాకు పని చేసిన ఇతర టెక్నీషియన్లు సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమాలో యాక్షన్ సీన్ల కొరకు మహేష్ బాబు ఏకంగా పదిరోజుల పాటు కష్టపడ్డాడని తెలుస్తోంది. సర్కారు వారి పాట సినిమాలో బీచ్ ఫైట్ సీక్వెన్స్ హైలెట్ గానిలిచిన సంగతి తెలిసిందే.

మొదట వైజాగ్ ఆర్కే బీచ్ లో ఈ సీన్ ను తెరకెక్కించాలని మేకర్స్ భావించినా మహేష్ ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడం కష్టమని భావించి ఆ నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గారు. సర్కారు వారి పాట సినిమాకు 125 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా కలెక్షన్లు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. మహేష్ నటించిన పలు సినిమాలు ఓవర్సీస్ లో రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించాయి.

ఓవర్సీస్ లో సర్కారు వారి పాట రిజల్ట్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది. మహేష్ అభిమానులు మాత్రం తమకు సర్కారు వారి పాట ఎంతగానో నచ్చిందని సోషల్ మీడియాలో చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ సినిమాకు టికెట్ రేట్లను పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వడంతో ఈ సినిమాకు టికెట్ రేట్లు భారీగా పెరిగాయి. సర్కారు వారి పాట దర్శకుడు పరశురామ్ కెరీర్ కు మాత్రం ప్లస్ కాకపోవచ్చని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

10 ఏళ్ళ ‘గబ్బర్ సింగ్’ గురించి 12 ఆసక్తికరమైన విషయాలు..!
‘చెల్లమ్మ’ టు ‘మ మ మహేషా’.. జోనిత గాంధీ పాడిన 10 సూపర్ హిట్ పాటల లిస్ట్..!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus