‘ఇస్మార్ట్ శంకర్’ లో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ఫిక్స్ ..!

  • January 28, 2019 / 10:48 AM IST

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి సొంత బ్యానర్లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంచిన మొదటి షెడ్యూల్ ను ఇటీవల మొదలుపెట్టారు. ఈ చిత్రం కోసం రామ్ ఓ కొత్త లుక్ ను ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ తో అది స్పష్టమవుతుంది. ఈ లుక్ లో రామ్ కొంచెం చూడ్డానికి… ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ లా ఉన్నాడంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు పెడుతున్నారు.

ఇక ఈ చిత్రంలో రామ్ సరసన హీరోయిన్ గా అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తుందంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా.. ‘సవ్యసాచి’ ‘మిస్టర్ మజ్ను’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన నిధి అగర్వాల్ ను ఖరారు చేసింది చిత్ర యూనిట్. ఇక మరో హీరోయిన్ కి కూడా ఈ చిత్రంలో చోటు ఉండడంతో.. ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నభా నటేశ్ ను తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. నాగ చైతన్య .. అఖిల్ సరసన నటించిన నిధి అగర్వాల్ కి గ్లామర్ పరంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంలో తన నటనతో ఆకట్టుకుంది నభా నటేశ్. మరి ఈ చిత్రం … ఈ భామలకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus