Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Reviews » Ramam Raghavam Review in Telugu: రామం రాఘవం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramam Raghavam Review in Telugu: రామం రాఘవం సినిమా రివ్యూ & రేటింగ్!

  • February 20, 2025 / 08:43 PM ISTByDheeraj Babu
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Ramam Raghavam Review in Telugu: రామం రాఘవం సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • ధన్ రాజ్ (Hero)
  • NA (Heroine)
  • సముద్రఖని , హరీష్ ఉత్తమన్, ప్రమోదిని, సత్య, సునీల్ తదితరులు.. (Cast)
  • ధన్ రాజ్ (Director)
  • పోలవరపు పృథ్వీ (Producer)
  • అరుణ్ చిలువేరు (Music)
  • దుర్గాప్రసాద్ కొల్లి (Cinematography)
  • Release Date : ఫిబ్రవరి 21, 2025
  • స్లేట్ పెన్సిల్ స్టోరీస్ (Banner)

కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ధన్ రాజ్ (Dhanraj) ఇప్పుడు దర్శకుడిగా తన సత్తా చాటుకొనే ప్రయత్నంలో తెరకెక్కించిన చిత్రం “రామం రాఘవం” (Ramam Raghavam). సముద్రఖని ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం టీజర్ & ట్రైలర్ సినిమాపై ఓ మోస్తరు అంచనాలు నమోదయ్యేలా చేశాయి. మరి సినిమా ఏమేరకు ఆకట్టుకుంది? దర్శకుడిగా ధన్ రాజ్ సక్సెస్ అయ్యాడా? అనేది చూద్దాం..!!

Ramam Raghavam Review

కథ: తన కొడుకు తనకు తానుగా మంచి పేరు సంపాదించుకొని జీవితంలో స్థిరపడాలి అనుకునే సగటు తండ్రి దశరథ రామం (సముద్రఖని) (Samuthirakani). చిన్నప్పటినుండి చెడు అలవాట్లకు బానిసై సరైన ఉద్యోగం లేక తండ్రి నెలజీతం మీద ఆధారపడి బ్రతికేసే కొడుకు రాఘవ (ధన్ రాజ్). ఒకానొక సందర్భంలో అప్పుల్లో కూరుకుపోయి.. ఏం చేయాలో తెలియక తండ్రిని చంపేసి, ఆయన చనిపోతే వచ్చే ఇన్స్యూరెన్స్ డబ్బుతో సెటిల్ అవ్వాలనుకుంటాడు రాఘవ.

కన్నతండ్రిని చంపాలనే రాఘవ ప్లాన్ కి లారీ డ్రైవర్ దేవ (హరీష్ ఉత్తమన్) (Harish Uthaman)ఎలా ఉపయోగపడ్డాడు? తండ్రి ప్రేమను రాఘవ అర్థం చేసుకోగలిగాడా? అనేది “రామం రాఘవం” (Ramam Raghavam). సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు: తండ్రి పాత్రలో సముద్రఖని జీవించేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో హరీష్ ఉత్తమన్ తో ఆయన మాట్లాడే సందర్భం చాలా హృద్యంగా ఉంటుంది. నటుడిగా ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ధన్ రాజ్ ఒక కిరాతకమైన కొడుకుగా కనిపించడానికి కాస్త కష్టపడ్డాడు. అయితే.. అతడి వ్యవహారశైలి ఎందుకు అలా ఉంది? ఎందుకలా మారాడు? అనేది సరిగా చూపించకపోవడంతో ఆ క్యారెక్టర్ సరిగా కనెక్ట్ అవ్వలేదు.

తల్లి పాత్రలో ప్రమోదిని (Pramodini) ఒదిగిపోయింది. ఆమెను చూస్తే మన ఇంట్లో అమాయక తల్లులు గుర్తుకొస్తారు. హరీష్ ఉత్తమన్ చాన్నాళ్ల తర్వాత ఒక మంచి పాత్రలో నటించాడు. సముద్రఖని తర్వాత మంచి క్యారెక్టర్ ఆర్క్ ఉన్నది హరీష్ ఉత్తమన్ పోషించిన దేవా పాత్రకే. సత్య (Satya Akkala) కామెడీ పంచులు అక్కడక్కడా పేలాయి. 30 ఇయర్స్ పృథ్వీ (Prudhvi Raj), సునీల్ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: దుగ్రాప్రసాద్ కొల్లి సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. లైటింగ్ & సీన్ కంపోజిషన్ విషయంలో తీసుకున్న కేర్ అవుట్ పుట్ లో కనిపించింది. కొన్ని ఫ్రేమ్స్ చూస్తే ఇది చిన్న సినిమా అని అస్సలు అనిపించదు. అలాగే.. అరుణ్ చిలువేరు సంగీతం కూడా డీసెంట్ గా ఉంది. నేపథ్య సంగీతం విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. కథకు అవసరమైన మేరకు ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ ఉన్నాయి. ప్రత్యేకించి ఎలివేట్ చేసే స్థాయిలో అయితే లేవు. చాలా క్రూషియల్ క్లైమాక్స్ సీన్ లో వర్షం గ్రాఫిక్స్ చేయడం అనేది సీన్ మూడ్ ను ఎఫెక్ట్ చేసింది. అలాంటి పొరపాట్లు చాలానే దొర్లాయి.

ఇక దర్శకుడిగా ధన్ రాజ్ పనితనం గురించి మాట్లాడుకోవాలి. ఒక టెక్నీషియన్ గా మంచి మార్కులు సంపాదించుకున్నాడు. నటీనటుల నుంచి సరైన నటన రాబట్టుకోవడం కానీ, ఫ్రేమ్స్ & లైటింగ్ విషయంలో కానీ ఒక దర్శకుడిగా అతడికి ఉన్న కమాండ్ ప్రశంసార్హం. అయితే కథకుడిగా మాత్రం అలరించలేక తడబడ్డాడు. ముఖ్యంగా.. తండ్రీకొడుకుల మధ్య బాండింగ్ ను సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. అలాగే కొడుకుక్కి తండ్రి మీద కోపం ఎందుకు అనేది కూడా సరిగా చూపించలేదు. అందువల్ల డ్రామా సరిగా వర్కవుట్ అవ్వలేదు. ఆ కారణంగా దర్శకుడిగా బొటాబోటి మార్కులతో సరిపెట్టుకున్నాడు ధన్ రాజ్.

విశ్లేషణ: ఒక కథలోని పాత్రలను ఎస్టాబ్లిష్ చేసినప్పుడు.. సదరు పాత్రల ప్రయాణం కూడా చూపించాలి. లేకపోతే.. ఆ పాత్ర ఎందుకలా బిహేవ్ చేస్తుంది? లేదా అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది? అనేదానికి అర్థం ఉండదు. “రామం రాఘవం” (Ramam Raghavam) విషయంలో దర్శకుడిగా ధన్ రాజ్ చేసిన తప్పు అదే.. కొడుకు పాత్రను సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు, ముఖ్యంగా కొడుకు క్యారెక్టర్ అంత దారుణమైన డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏమిటి అనేది సరిగా చూపించకపోవడం కారణంగా.. ముగింపు కదిలించినా, రీజనింగ్ సరిగా లేకపోవడంతో పెద్దగా ఎఫెక్ట్ చేయదు. ఆ కారణంగా “రామం రాఘవం” (Ramam Raghavam). కోర్ పాయింట్ లో షాక్ వాల్యూ ఉన్నప్పటికీ.. దాన్ని తెరకెక్కించిన విధానంలో ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవ్వడంతో ఓ సగటు సినిమాగా మిగిలిపోయింది.

ఫోకస్ పాయింట్: ధన్ రాజ్ డీసెంట్ డెబ్యూ!

రేటింగ్: 2.5/5

Click Here to Read in ENGLISH

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanraj
  • #Harish Uthaman
  • #Pramodini
  • #ramam raghavam
  • #Samuthirakani

Reviews

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

trending news

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

16 hours ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

17 hours ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

21 hours ago
Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

1 day ago
Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

23 hours ago
Doosara: గంగూలీ ‘బయోపిక్‌’పై కోర్టు తీర్పు.. ఆ సినిమా రిలీజ్‌కి ఓకే

Doosara: గంగూలీ ‘బయోపిక్‌’పై కోర్టు తీర్పు.. ఆ సినిమా రిలీజ్‌కి ఓకే

24 hours ago
Kayadu Lohar: ‘చుక్క’లు చూపిస్తున్న నెటిజన్లు.. పాత విమర్శలు బయటకు తీసి మరీ..

Kayadu Lohar: ‘చుక్క’లు చూపిస్తున్న నెటిజన్లు.. పాత విమర్శలు బయటకు తీసి మరీ..

1 day ago
Yash: డేంజరస్‌ క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. అయినా ట్రోలర్స్‌ ఊరుకుంటారా?

Yash: డేంజరస్‌ క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. అయినా ట్రోలర్స్‌ ఊరుకుంటారా?

1 day ago
Rukmini Vasanth: ఆ బయోపిక్‌ మిస్‌ అయింది.. మరో సింగర్‌ కథతో రుక్మిణీ వసంత్‌

Rukmini Vasanth: ఆ బయోపిక్‌ మిస్‌ అయింది.. మరో సింగర్‌ కథతో రుక్మిణీ వసంత్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version