మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’. ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ ‘ఆర్.టి.టీం వర్క్స్’ పతాకం పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రెజిషా విజయన్ లు హీరోయిన్లుగా నటించారు. ‘ఖైదీ'(2019) ఫేమ్ సామ్ సి ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 9 ఏళ్ళ తర్వాత సీనియర్ హీరో వేణు ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. టీజర్, ట్రైలర్ లకు సూపర్ రెస్పాన్స్ లభించింది.
దీంతో ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం
5.20 cr
సీడెడ్
2.90 cr
ఉత్తరాంధ్ర
2.00 cr
ఈస్ట్
1.25 cr
వెస్ట్
1.02 cr
గుంటూరు
1.30 cr
కృష్ణా
1.10 cr
నెల్లూరు
0.75 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
15.52 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
1.00 cr
ఓవర్సీస్
1.20 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
17.72 cr
‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రానికి రూ.17.72 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.18 కోట్ల షేర్ ను రాబట్టాలి. పోటీగా పెద్ద సినిమాలు ఏమీ లేవు. ఉన్నవి కూడా అంత క్రేజ్ ఉన్న సినిమాలు కావు. కాబట్టి సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా టార్గెట్ రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
రవితేజ గత చిత్రం ‘ఖిలాడి’ ప్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రూ.13.55 కోట్ల షేర్ ను రాబట్టింది. కాబట్టి.. ‘రామారావు..’ బాక్సాఫీస్ టార్గెట్ పెద్దది అయితే కాదు. మాస్ ఆడియన్స్ లో కూడా ఈ చిత్రం మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.