ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో కీలక రోల్ పోషించనున్న రంభ .!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాల్లో మహిళలకు హీరోలకు సమానమైన పాత్రలను ఇస్తూ గౌరవిస్తుంటారు. ఆ విధంగా నదియా, స్నేహ, ఖుష్బూ లు మంచి రోల్స్ దక్కించుకున్నారు. తాజాగా ఈ జాబితాలోకి రంభ చేరబోతోంది. హిట్లర్, బావగారు బాగున్నారా సినిమాల్లో చిరంజీవితో కలిసి స్టెప్స్ వేసిన రంభ  పెళ్లి తర్వాత పరిశ్రమకు దూరమైంది. దుబాయ్ కి వెళ్ళింది. గత ఏడాది భర్తతో గొడవపడి ఇండియాకి వచ్చిన ఆమె టీవీ షోలలో జడ్జిగా వ్యవహరించింది. మంచి రోల్ దొరికితే తెలుగు చిత్రాల్లో రీ ఎంట్రీ ఇవ్వడానికి ఎదురుచూసింది.

తాజాగా త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాలో మంచి రోల్ దొరకడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. “యమదొంగ’ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి “నాచోరే .. నాచోరే” అంటూ ఒక స్పెషల్ సాంగ్ ను చేసింది. ఇప్పుడు ఎన్టీఆర్ తో పోటీగా నటించనుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకి “అసామాన్యుడు” అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. డీజే బ్యూటీ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో సాగుతోంది. పూజ, తారక్ లపై సరదా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్వరలో ఈ షూటింగ్ లో రంభ జాయిన్ కానుంది. ఎస్.ఎస్. థమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus