Ramcharan , Pawan Kalyan: బాబాయ్ కి హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం.. రామ్ చరణ్ కామెంట్స్ వైరల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా రెండు భాగాలుగా ప్రసారం చేయనున్నారు ఈ క్రమంలోని మొదటి భాగం మార్చి మూడవ తేదీ ప్రసారమైంది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇలా ఈ కార్యక్రమాల ద్వారా పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఎన్నో విషయాల గురించి ముచ్చటించారు. ఇక బాలకృష్ణ ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ కి ఫోన్ చేసి తనకు ఉన్న అనుబంధం గురించి అడిగి తెలుసుకున్నారు.

రామ్ చరణ్ కు ఫోన్ చేసిన బాలయ్య మీ బాబాయితో నీకున్న అనుబంధం ఏంటి అని చెప్పడంతో తనకు తన బాబాయ్ తోనే ఎంతో మంచి అనుబంధం ఉందని చిన్నప్పుడు తన అమ్మ దగ్గర కన్నా బాబాయ్ దగ్గర ఎక్కువ సమయం గడిపానని తెలిపారు. మీ బాబాయ్ గురించి ఎవరికీ తెలియని సీక్రెట్ చెప్పు అంటూ బాలయ్య ప్రశ్నించగా బాబాయ్ కు హైదరాబాద్ బిర్యాని అంటే చాలా ఇష్టం అని ఆయన వారం మొత్తం బిర్యానీ తినమన్నా తింటారని చరణ్ తెలిపారు.

మరి మీ నాన్న చిరంజీవి గారికి తెలియకుండా మీరిద్దరూ కలిసి చేసిన అల్లరి పని ఏంటి అని ప్రశ్నించడంతో వెంటనే పవన్ కళ్యాణ్ సింగపూర్ ట్రిప్ గురించి చెప్పు అంటూ హింట్ ఇచ్చి సైలెంట్ అయ్యారు. ఇక ఈ విషయానికి రాంచరణ్ మాట్లాడుతూ అప్పట్లో నేను బాబాయికి చాలా నరకం చూపించాను అని తెలిపారు. అమ్మ మాతో లేరు కదా అని రోడ్డుపై ఫ్రెంచ్ ఫ్రైస్ బర్గర్ తిని రోడ్డు మీదే వాంతి చేసుకుంటే బాబాయ్ క్లీన్ చేశారని ఈ సందర్భంగా రామ్ చరణ్ తెలిపారు.

అప్పుడు నీ వయసు ఎంత అంటూ బాలయ్య ప్రశ్నించగా ఓ నాలుగైదు సంవత్సరాలు ఉంటాయని చరణ్ తెలపడంతో ఐదేళ్ల కుర్రాడిని చంకలో పెట్టుకొని సింగపూర్ వెళ్లడం ఏంటమ్మా అంటూ సరదాగా ఆట పట్టించారు. ఇలా పవన్ కళ్యాణ్ గురించి రామ్ చరణ్ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus