జయకృష్ణను ఇంట్రడ్యూస్ చేసే బాధ్యత బాబాయ్ మహేష్ బాబుదే..!

సూపర్ స్టార్ కృష్ణ గారు నవంబర్ 15 తెల్లవారు జామున ఈలోకాన్ని విడిచి వెళ్లిపోయిన విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులే కాదు.. తెలుగు ప్రజలు కూడా ఇంకా మర్చిపోలేకపోతున్నారు.. కాగా గురువారం (నవంబర్ 17) కుటుంబ సభ్యులు కృష్ణ గారి చిన్నకర్మ (మూడవ రోజు కార్యక్రమం) ఏర్పాటు చేశారు. ఆయన తమ్ముడు ఆది శేష‌గిరి రావు, మహేష్ బాబు, మంజుల, సుధీర్ బాబు, గల్లా జయదేవ్ కుటుంబ సభ్యులు కృష్ణ గారికి శ్రద్ధాంజలి ఘటించారు.

తాత మరణవార్త విని విదేశాల్లో చదువుకుంటున్న మహేష్, నమ్రతల పిల్లలు సితార, గౌతమ్ చనిపోయిన రెండో రోజే హైదరాబాద్ వచ్చి తాతని కడసారి చూసుకుని నివాళి అర్పించారు.. ఈ సందర్భంగా తాతపై ఉన్న ప్రేమను తెలియజేస్తూ సితార చేసిన పోస్ట్ చూసి అందరూ భావోద్వేగానికి గురయ్యారు.కృష్ణ గాారి అంత్యక్రియలు ముగిసిన మర్నాడు అమెరికా నుండి వచ్చాడు రమేష్ బాబు తనయుడు జయకృష్ణ.. రమేష్ బాబుకి భార్య మృదుల.. కుమార్తె భారతి, కుమారుడు జయకృష్ణ ఉన్నారు.

హీరోగా ఎంట్రీ ఇవ్వాలని జయకృష్ణ కొద్దికాలంగా చదువుతో పాటు నటనలో శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. తానెలాగో సక్సెస్ కాలేకపోయాను కనుక కొడుకుని మాత్రం మంచి హీరోగా చూడాలని ఉండేదట రమేష్ బాబుకి. ఆమధ్య వైజాగ్ సత్యానంద్ మాస్టర్ దగ్గర నటనలో ఓనమాలు నేర్చుకుని.. కొద్దికాలంగా అమెరికాలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు జయకృష్ణ.. బాబాయ్ మహేష్ హీరోగా చేసిన ‘నిజం’ సినిమా ప్రారంభంలో కనిపించే చిన్నపిల్లాడు తనే.. మంచి ఒడ్డూ పొడుగుతో చూడ్డానికి హీరో మెటీరియల్ అనిపిస్తున్నాడు..

త్వరలో పూర్తిగా ట్రైనప్ అయ్యి హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు జయకృష్ణ.. తాత, నాన్న లేరు కాబట్టి తన లాంఛింగ్ బాబాయ్ మహేష్ చేతుల మీదగానే జరగుతుంది..కృష్ణ గారి చిన్నకర్మ కార్యక్రమంలో అన్నయ్య రమేష్ బాబు పిల్లలు జయకృష్ణ, భారతిలతో మహేష్ బాబు కలిసి ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్నయ్య భార్య, వదిన మృదుల కూడా పిల్లలతో పాటు కలిసి ఫోటోస్‌లో ఉన్నారు..

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus