ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిశోర్ తిరుమల డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘రెడ్’. కరోనా లాక్ డౌన్ కారణంగా.. ఇప్పటివరకూ విడుదలకు నోచుకోని సినిమాల్లో ఇదొక్కటి. నిజానికి ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చెయ్యమని భారీ ఆఫర్లు వచ్చినప్పటికీ.. నిర్మాతలు ముందడుగు వెయ్యలేదు. ఇక థియేటర్లు కూడా ఈ మధ్యనే తెరుచుకోవడంతో ఇక ఓటిటిలో విడుదల చేసే ఆలోచనను.. ‘రెడ్’ దర్శకనిర్మాతలు మానుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ‘రెడ్’ ను సంక్రాంతి కానుకగా థియేటర్లలోనే విడుదల చెయ్యబోతున్నట్టు నిర్మాతలు నిన్న అధికారికంగా ప్రకటించారు.
ఇదిలా ఉండగా.. ‘రెడ్’ విడుదల కాకుండానే ఓ సెన్సేషన్ క్రియేట్ చేసినట్టు తాజా సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ రూపంలో అప్పుడే 13.5 కోట్లు రాబట్టిందట. జెమినీ టీవీ వారు రెడ్ హక్కులను ఈ ఫ్యాన్సీ రేటుకి కొనుగోలు చేసినట్టు సమాచారం. కరోనా వల్ల ఇప్పుడు సినీ ఇండస్ట్రీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ.. ‘రెడ్’ చిత్రానికి అంత రేటు పలకడం అంటే మాటలు కాదు. ఏమైనా ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం విజయంతో రామ్ మార్కెట్ డబుల్ అయ్యిందనేది మాత్రం అందరూ ఒప్పుకోవాల్సిన నిజం.