Ramya Krishna: గ్లామర్ తో కూడుకున్న రమ్యకృష్ణ లేటెస్ట్ వీడియో చూసారా..!

ఒకప్పుడు తన గ్లామర్ తో సౌత్ మొత్తాన్ని ఓ ఊపు ఊపేసిన రమ్యకృష్ణ ఇప్పటికీ తన హవా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్లకు ధీటుగా రాణిస్తుంది. పారితోషికం విషయంలో కూడా ‘తగ్గేదే లే’ అన్నట్టు దూసుకుపోతుంది. రోజుకు రూ.10 లక్షల చొప్పున డిమాండ్ చేస్తున్నట్లు ఇటీవల రమ్యకృష్ణ గురించి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ‘బాహుబలి'(సిరీస్) లో చేసిన శివగామి పాత్ర… ఈమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఆ తర్వాత ‘సోగ్గాడే చిన్ని నాయన’ ‘రొమాంటిక్’ ‘బంగార్రాజు’ చిత్రంలో కూడా ఈమె పాత్రలు చాలా బాగా వచ్చాయి. త్వరలో రమ్యకృష్ణ ‘లైగర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఆమె విజయ్ దేవరకొండ కు తల్లిగా చాలా పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్టు ట్రైలర్ లో చూశాం. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ముంబై వెళ్లిన రమ్యకృష్ణ..అక్కడ ఉల్లి పొర లాంటి చీరలో దర్శనమిచ్చింది. స్టూడియో బయట ఫోటో షూట్లలో పాల్గొనడానికి ఆమె బయటకు వస్తే గాలి ఎక్కువగా రావడం వలన ఆమె నడుము అందాలు బయటపడ్డాయి.

గాలికి చీర సర్దుకుంటూ, జుట్టు సవరించికుంటూ కొంచెం ఘాటుగానే ఫోజులు ఇచ్చారు రమ్యకృష్ణ.గాలి వలన చీర రమ్యకృష్ణని ఇబ్బంది పెట్టినప్పటికీ.. ‘ఆమె అందాలు మాత్రం చెక్కు చెదర్లేదంటూ’ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 51 ఏళ్లలో ఈ రేంజ్ గ్లామర్ మెయింటైన్ చేయడం అంటే నిజంగా మామూలు విషయం కాదనే చెప్పాలి. రమ్యకృష్ణ చీర వీడియో మాత్రం ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus