పాతికేళ్ల అనుభవం.. పాతికేళ్ల నుంచి తరగని అందం ఆమె సొంతం. అందరికీ నిత్యం పోటీ.. ఆమెకి మాత్రం ఎవరూ రారు సాటి. ఆమె రమ్యకృష్ణ. 1984 లో అడుగు పెట్టి వరుస అపజయాలు చవిచూసినప్పటికీ ఆమె మనసు చెదిరి పోలేదు. నమ్మకం చెక్కుచెదరలేదు. సూత్రదారులు సినిమాతో నటిగా నిలబడిన ఆమె.. అల్లుడుగారు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి నుంచి కెరీర్ గ్రాఫ్ ని పెంచుకుంటూ పోతున్నారు. హీరోయిన్ అవకాశాలు సన్నగిల్లగానే ఇతర పాత్రల్లో తన ప్రతిభని చూపించి సినిమాకి బలమైంది. రీసెంట్ గా వచ్చిన బాహుబలిలో శివగామి పాత్రతో నటీనటులందరినీ ఉలిక్కిపడేలా చేసింది. భారీ క్రేజ్ సొంతం చేసుకుంది.
ఎంతంటే హీరోయిన్స్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకునేంత. ప్రస్తుతం ఆమె మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న శైలజా రెడ్డి అల్లుడు చిత్రంలో నటిస్తోంది. అల్లుడు నాగచైతన్య అయితే శైలజా రెడ్డి రమ్యకృష్ణ. నిన్నటి నుండే ఈ చిత్ర షూటింగ్ లో జాయిన్ అయింది. ఈ సందర్భంగా ఆమె రెమ్యునరేషన్ బయటికి వచ్చింది. ఆమె రోజుకి ఆరు లక్షలు తీసుకుంటున్నట్టు సమాచారం. అంటే పది రోజులకు అరవై లక్షలు. సినిమాకి ఇరవై రోజులైనా కేటాయించాలి. సో కోటి 20 లక్షలు. స్టార్ హీరోయిన్స్ కూడా ఇంతమొత్తంలో తీసుకోవడం లేదు. అందుకే హీరోయిన్స్ కంటే రమ్యకృష్ణ గ్రేట్ అని సినీ విశ్లేషకులు అభినందిస్తున్నారు.