1984లో వెండితెర తెరంగేట్రం చేసిన రమ్యకృష్ణ తెలుగు, తమిళ, హిందీ భాషల్లోని అందరు అగ్ర కథానాయకులు, యువ కథానాయకులతో వర్క్ చేసింది. ఇప్పుడు యువ కథానాయకులతోనూ కలిసి పనిచేస్తోంది. కేవలం వెండితెర మీద మాత్రమే కాదు బుల్లితెర వీక్షకులను అలరించింది రమ్యకృష్ణ. ఇప్పుడు తన కాన్సన్ ట్రేషన్ ను ఇంటర్నట్ పై సారిస్తోంది. జయలలిత జీవితం ఆధారంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందనున్న ఓ వెబ్ సిరీస్ లో రమ్యకృష్ణ టైటిల్ పాత్ర పోషించనుంది.
నిజానికి జయలలిత బ్రతికున్నప్పుడే రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో ఆమె బయోపిక్ ను ప్లాన్ చేశారు. కానీ. జయలలిత మరణం అనంతరం ఏకంగా మూడు బయోపిక్ లు ఎనౌన్స్ అవ్వడం, ఒకట్రెండు సినిమాలు షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వడం కూడా జరిగిపోయాయి. దాంతో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక సినిమా మొదలెట్టేబదులు.. వెబ్ సిరీస్ అనుకొన్నారు. ఈ వెబ్ సిరీస్ ను ఎవరు డైరెక్ట్ చేయనున్నారు అనేది తెలియాల్సి ఉన్నప్పటికీ.. ఈ వెబ్ సిరీస్ కోసం రమ్యకృష్ణ భారీ మొత్తం పారితోషికం అందుకుందని తెలుస్తోంది