Ramya Krishna: రమ్యకృష్ణ సినీ కెరీర్ కు ప్లస్ అయిన సినిమా ఇదే!

  • August 29, 2022 / 12:53 PM IST

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో రమ్యకృష్ణ ఒకరు. బాహుబలి, బాహుబలి2 సినిమాలలో ఆమె పోషించిన శివగామి పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. భలే మిత్రులు అనే సినిమాతో రమ్యకృష్ణ హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టగా సూత్రధారులు అనే సినిమా నటిగా రమ్యకృష్ణకు మంచి పేరును తెచ్చిపెట్టింది. అయితే ఆ సమయంలో రమ్యకృష్ణ నటించిన కొన్ని సినిమాలు సక్సెస్ సాధించలేదు. రమ్యకృష్ణ నటించిన సినిమాలు ఆశించిన విధంగా హిట్ కాకపోవడంతో ఆమెకు ఐరన్ లెగ్ ఇమేజ్ వచ్చింది.

కొంతమంది రమ్యకృష్ణ నటిస్తే సినిమా ఫ్లాప్ అని జోరుగా ప్రచారం చేయడం గమనార్హం. రమ్యకృష్ణ ఐరన్ లెగ్ సెంటిమెంట్ వల్ల కొన్ని సినిమాలలో హీరోయిన్ గా ఎంపికైన తర్వాత కూడా ఆ సినిమాలలో అవకాశాలను కోల్పోవడం గమనార్హం. అయితే మోహన్ బాబు రమ్యకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించిన అల్లుడుగారు సినిమా సక్సెస్ సాధించింది. ఆ తర్వాత అల్లరి మొగుడు సినిమాలో మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనా కలిసి నటించారు.

ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం. 1992 సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం గమనార్హం. అల్లుడుగారు, అల్లరి మొగుడు సినిమాల ద్వారా రమ్యకృష్ణ ఐరన్ లెగ్ ఇమేజ్ ను పోగొట్టుకున్నారనే చెప్పాలి. ప్రస్తుతం రమ్యకృష్ణ వరుస ఆఫర్లతో నటిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

రమ్యకృష్ణ హీరో తల్లి పాత్రలో నటించిన లైగర్ మూవీ తాజాగా థియేటర్లలో విడుదల కాగా ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందనే సంగతి తెలిసిందే. రమ్యకృష్ణ తన సినీ కెరీర్ లో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. సినిమాసినిమాకు రమ్యకృష్ణకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus