వైరల్ అవుతున్న రమ్యకృష్ణ చిన్నప్పటి ఫోటో?

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది రమ్యకృష్ణ. నిజానికి ఈమె తమిళమ్మాయి అయినప్పటికీ తెలుగమ్మాయి అనేలా ఉంటుంది. దాదాపు అప్పటి స్టార్ హీరోలందరి సరసన ఈమె నటించేసింది. కేవలంలో తెలుగులో మాత్రమే కాదు తమిళంలో కూడా రమ్యకృష్ణ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మొదట్లో ఈమెను ‘ఐరన్ లెగ్’ అని కొన్నాళ్ళు .. అలాగే ‘కేవలం గ్లామర్ పాత్రలకు మాత్రమే పనికొస్తుంది’ అని మరికొన్నాళ్ళు విమర్శించేవారట. అయినప్పటికీ ఆ ఒడుదుడుకులను అన్నిటినీ తట్టుకుని ఫైట్ చేసి ఈ స్థాయిలో ఉన్నట్టు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు రమ్యకృష్ణ.

‘నరసింహా’ సినిమాలో ఈమె రజినీ కాంత్ కు ధీటుగా నటించి.. అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘బాహుబలి’ ‘సూపర్ డీలక్స్’ వంటి చిత్రాలతో ఇప్పటికీ ఆమె క్రేజీ నటిగానే రాణిస్తుంది. ఇది పక్కన పెట్టేస్తే.. ఈ లాక్ డౌన్ సమయంలో సెలబ్రిటీలంతా ఇళ్ళ దగ్గరే ఉంటూ… తమ పాత ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రమ్యకృష్ణ కూడా తన చిన్నప్పటి ఫొటోని ఇన్స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆమె చదువుకుంటున్న రోజుల్లో తోటి స్టూడెంట్స్ అలాగే టీచర్స్ తో తీసుకున్న ఫోటో ఇదని స్పష్టమవుతుంది. ఈ ఫోటోలో ఆమె మొహానికి రౌండప్‌ చేసి పోస్ట్ చేసింది.

కళ్ళద్దాలు పెట్టుకుని ఎంతో క్యూట్ గా ఈ ఫోటోలో కనిపిస్తుంది రమ్యకృష్ణ.ఈమెకు కొంచెం డిజప్పాయింట్మెంట్ ఫీలింగ్ వచ్చినా.. ఈ ఫోటోని చూస్తే నార్మల్ అయిపోతుందట. ఈ విషయాన్ని ఆమె తన సన్నిహితులు దగ్గర చెప్పినట్టు సమాచారం. ఇక ప్రస్తుతం రమ్యకృష్ణ విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus