వెంకటేశ్ – రానా కలసి ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘రానా నాయుడు’ పేరుతో ఆ వెబ్ సిరీస్‌ను హిందీలో తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్ గురించి కొన్ని నెలల ముందు అనౌన్స్‌మెంట్ వచ్చింది. అయితే ఆ తర్వాత దీని గురించి పెద్దగా విశేషాలేమీ బయటికి రాలేదు. ఆ మధ్య ‘అన్‌స్టాపబుల్’ షోలో ఈ సిరీస్ గురించి రానా ఒకటి రెండు విషయాలు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలిశాయి. ఇటీవల ‘భీమ్లా నాయక్’ ప్రమోషన్స్ భాగంగా ఈ వివరాలు చెప్పుకొచ్చాడు రానా.
‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌లో వెంకటేశ్, రానా పాత్రలు డిఫరెంట్‌గా ఉంటాయి. అయితే వెంకటేశ్ పాత్ర కొంచెం ఎక్కువ డిఫరెంట్ అని సమాచారం. ఇప్పటికే విడుదలైన లుక్‌లో కూడా వెంకటేశ్ వైట్ హెయిర్‌తో డిఫరెంట్‌గా ఉన్నాడు. ఈ సిరీస్‌లో బూతులు ఎక్కువగా ఉన్నాయనేది బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ షో చెప్పాడు. ఈ మాటలకు రానా స్పందిస్తూ… అవును కొంచెం ఎక్కువ బూతులే ఉన్నాయి అంటూ యాడింగ్ చేశాడు. అందుకే తెలుగులో చేయడం లేదు అని కూడా అన్నాడు.
‘భీమ్లా నాయక్’ సినిమా ప్రచారంలో రానా చురుకుగా పాల్గొనడం లేదు. కారణమేంటి అని ఆరా తీస్తే ‘రానా నాయుడు’ షూటింగ్‌లో బిజీగా ఉండటమే కారణం అని తెలిసింది. రానాను ఇదే విషయం అడిగితే… సినిమా విడుదలైన రోజున కూడా బిజీగా ఉన్నానని, షూటింగ్ పూర్తి చేసుకొని సాయంత్రం సినిమా చూశానని చెప్పాడు. ‘భీమ్లా నాయక్’ రిలీజ్ రోజున రానా ముంబయిలో షూట్‌లో పాల్గొన్నాడట. ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తోందనే విషయం తెలిసిందే. బడ్జెట్ విషయంలో ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదట. అలాగే నిడివి విషయంలోనూ భారీతనం చూపిస్తున్నారట.
ఈ వెబ్ సిరీస్ నిడివి సుమారు 8 గంటలు ఉంటుందని ప్రచారం నడుస్తోంది. మన దేశంలో ఇంత నిడివితో రూపొందిన వెబ్ సిరీస్‌లు లేవనే చెప్పొచ్చు. చాలా వరకు 3 నుండి 5 గంటల నిడివిలో సిరీస్‌లు అయిపోయేలా చూస్తారు. 8 గంటలంటే మన దగ్గర నిడివి ఎక్కువే. మరి వెంకీ, రానా కలసి ఈ భారీ వెబ్ సిరీస్‌లో ఎలా అభిమానులను మురిపిస్తారో చూడాలి. అన్నట్లు అమెరికన్ క్రైమ్ డ్రామా ‘రే డోనొవన్’ ఆధారంగా ‘రానా నాయుడు’ తెరకెక్కుతోంది. కరణ్ అన్షుమన్, సుపర్ణ్ వర్మ తెరకెక్కిస్తున్నారు.