రానా-వరుణ్ తేజ్ ల మళ్టీస్టారర్

నూతన సంవత్సరం సందర్భంగా తన తాజా చిత్రం ‘హాతీ మేరా సాతీ’ ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన రానా ఆ సినిమాలోని డిఫరెంట్ లుక్ తో ఆశ్చర్యానికి గురి చేశాడు. డ్రెస్సింగ్ మొదలుకొని హెయిర్ స్టైల్ అండ్ బాడీ వరకూ విపరీతమైన ఛేంజోవర్ తో రానా లుక్ అందర్నీ అలరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం రాణా దాదాపు 15 కేజీల బరువు తగ్గాడట. తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లోనూ రూపొందనున్న ఈ చిత్రంలో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా నటించనున్నాడని తెలుస్తోంది.

రానాకి మల్టీస్టారర్లు కొత్తేమీ కాదు కానీ.. వరుణ్ కి మాత్రం ఇదే మొదటి మల్టీస్టారర్ సినిమా. దాంతో ఈ ప్రొజెక్ట్ పై ఇప్పట్నుంచి అంచనాలు అందలాన్నెక్కుతున్నాయి. “ప్రేమ ఖైదీ, గజరాజు” చిత్రాల ఫేమ్ ప్రభు సోలోమన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రానా మావటి యువకుడిగా నటించనుండగా.. వరుణ్ ఓ నాగరిక యువకుడిగా కనిపించనున్నాడని వినికిడి. కథ మొత్తం రాణా, వరుణ్, ఏనుగు చుట్టూ తిరుగుతుందట. ఈ వార్తలో నిజం ఎంతో తెలియాలంటే అఫీషియల్ ప్రెస్ నోట్ వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే. కాకపోతే.. నిజమైతే మాత్రం క్రేజీ కాంబినేషన్ అవుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus