టాలీవుడ్‌లో గత కొన్నేళ్లుగా వినిపిస్తూ… ఇంకా మొదలుకాని రెండు సినిమాలు ఇటీవల కాలంలో స్పీడప్ అవుతున్నాయి. ఒక సినిమా అనౌన్స్‌మెంట్ అయితే, మరో సినిమాను స్టార్ట్ చేసేశారు కూడా. అందులో ఒక సినిమా ‘హిరణ్య కశ్యప’. రానా ప్రధాన పాత్రలో ఈ సినిమాను తెరకెక్కించాలని గుణశేఖర్ చాలా ఏళ్లుగా ప్రయత్నించారు. అయితే ఎట్టకేలకు ఈ సినిమాను త్రివిక్రమ్ రచనతో సిద్ధం చేయబోతున్నారు. ఈ సినిమా గురించి రానా కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు.
‘హిరణ్యకశ్యప’ సినిమా గురించి చెబుతూ… రాక్షస రాజుకు హిరణ్య కశ్యపుడికి విష్ణుమూర్తి అంటే ఏమాత్రం గిట్టదని… అందుకే ఆయన భక్తులను చిత్రహింసలకు గురి చేస్తుంటాడు. అయితే హిరణ్యకశ్యపుడి కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుభక్తుడుగా మారుతాడు. కొడుకు కారణంగా ఆ రాక్షసుడు అంతమవుతాడు. ఇప్పుడు ఆ కథనే సినిమాగా చూపిస్తాం అని రానా చెప్పాడు. ‘బాహుబలి’ సినిమాలో భళ్లాలదేవుడిగా నటించాక.. ఎలాంటి పౌరాణిక పాత్రలైనా చేయగలననే నమ్మకం ఏర్పడింది అని చెప్పాడు.
1967లో వచ్చిన ‘భక్త ప్రహ్లాద’ గురించి ఇప్పటికీ మాట్లాడుతున్నాం. ఇప్పుడు కొత్త వెర్షన్‌లో ఆ కథను ఇప్పటితరానికి అందించాలనే ఆలోచనలో సినిమా చేస్తున్నాం. సినిమా స్క్రిప్ట్ వర్క్ వేగంగా జరుగుతోంది. వచ్చే మార్చిలో సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. జులైలో శాన్‌డియాగోలో నిర్వహించిన ‘శాన్‌డియాగో కామిక్ కాన్’లో ‘హిరణ్య కశ్యప’ కాన్సెప్ట్ టీజర్‌కు మంచి స్పందన వచ్చిందని చెప్పాడు రానా. అదే ఫీలింగ్ సినిమా వచ్చాక జనాల్లో ఉంటుందని రానా అంటున్నాడు.
ఇక ‘హిరణ్యకశ్యప’ సినిమాను గతంలో గుణశేఖర్ దర్శకత్వంలో (Rana) రానా చేస్తారని వార్తలొచ్చాయి. చాలా రోజులుపాటు ఇంకా చెప్పాలంటే ఏళ్లపాటు ఈ సినిమా కోసం గుణశేఖర్ పని చేశారు. ఇదిగో, అదిగో అంటూ.. చెప్పినా ఫైనల్‌గా ఆ అవకాశం ఎవరికి వస్తోందో తెలియడం లేదు. త్రివిక్రమ్ సినిమాకు కేవలం రచయితగా మాత్రమే అందుబాటులో ఉంటారు. సినిమాను హ్యాండిల్ చేసేది వేరే దర్శకుడు అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?