Bheemla Nayak: ”నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట..”: డానియల్‌ శేఖర్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాకు రీమేక్ గా దీన్ని రూపొందిస్తున్నారు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు-స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది ‘భీమ్లా నాయక్’ టీమ్.

తాజాగా దగ్గుబాటి రానా క్యారెక్టర్ ను రివీల్ చేస్తూ ఓ వీడియోను వదిలారు. ముందుగా రానా పోలీస్ స్టేషన్ లో చాలా పొగరుగా కూర్చొని ఉన్న సన్నివేశాలను చూపించారు. ఆ తరువాత సినిమాలో పవన్ కళ్యాణ్ భార్యతో మాట్లాడే సీన్ ను చూపించారు. ‘నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట.. స్టేషన్ లో టాక్ నడుస్తోంది. నేనెవరో తెలుసా..? ధర్మేంద్ర హీరో.. హీరో..’ అంటూ చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది.

ఆ తరువాత వీడియో చివర్లో.. ‘డానీ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నెం.1’ అంటూ అరుస్తూ డైలాగ్ చెప్పాడు రానా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. #BheemlaNayak #BLITZofDANIELSHEKAR అనే ట్యాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!


‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus