Rana Daggubati: రానా దగ్గుబాటి పోస్ట్ లు డిలీట్ చేయడం వెనుక కారణం అదే..!

దగ్గుబాటి రానా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సడన్ గా పోస్టులు డిలీట్ చేశాడు. ఇది తెలిసిన వెంటనే ‘రానా సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి అనుకుంటున్నాడా?’ అనే అనుమానాలు వ్యక్తమవ్వడం సహజం. అయితే ఈరోజు రానా-మిహీక ల 2వ పెళ్లి రోజు.దీంతో అంతకు మించి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు అవి పీక్స్ కు కూడా వెళ్లిపోయాయి. అందుకే రానా స్వయంగా రంగంలోకి దిగి కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోబోతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు.

‘సినిమాలతో కలుద్దాం అన్నట్టు… బిగ్గర్- బెటర్- స్ట్రాంగర్.. లాట్స్ ఆఫ్ లవ్ టు ఆల్ ఆఫ్ యు’ అంటూ ఓ పోస్ట్ పెట్టాడు. మరో పక్క రానా భార్య మిహీకా బజాజ్.. కొద్దిసేపటి క్రితం తమ మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా రానాతో దిగిన ఫోటోలను షేర్ చేసింది. దీంతో అనుమానాలు అన్నిటికీ మొదట్లోనే ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు ఈ దంపతులు. ఈ మధ్య కాలంలో చాలా మంది టాలీవుడ్ జంటలు సెపరేట్ అవుతున్న నేపథ్యంలో..

ఇలాంటి పోస్టులు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి,అలాగే పెద్ద చర్చలకు కూడా దారితీస్తున్నాయి. రానా, మిహీక దంపతులు క్లారిటీ ఇవ్వకపోతే కనుక… ఈ టాపిక్ పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యుండేది. ఇక రానా సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది ‘భీమ్లా నాయక్’ లో డానియల్ శేఖర్ గా, ‘విరాట పర్వం’ లో రావన్నగా ప్రేక్షకులను అలరించాడు రానా.

ఇప్పటి వరకు అన్ని భాషల్లోనూ కలుపుకుని 29 చిత్రాల్లో నటించిన రానా ఇప్పుడు 30వ చిత్రానికి రెడీ అవుతున్నాడు. తన నెక్స్ట్ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియజేయనున్నాడు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus