Rana Daggubati Interview: ‘భీమ్లా నాయక్’ మూవీ పై రానా దగ్గుబాటి ఆసక్తికర వ్యాఖ్యలు..!

పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలయికలో ‘భీమ్లా నాయక్’ రూపొందిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. సాగర్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే ను అందించగా.. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మించారు. కాగా ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపథ్యంలో దగ్గుబాటి రానా.. ‘భీమ్లా నాయక్’ కు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు.

ప్ర. ‘భీమ్లా నాయక్’ విడుదల రోజున టాక్ విన్న తర్వాత మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది?

జ. ‘భీమ్లా నాయక్‌’ రిలీజ్ రోజు నేను ముంబైలో వేరే షూటింగ్‌లో ఉన్నానండీ. అక్కడ షూటింగ్ కంప్లీట్ అయ్యాక అక్కడి తెలుగు ఆడియెన్స్ తో కలిసి సినిమా చూశాను.మార్నింగ్ నుండే సూపర్‌హిట్‌ అంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపించింది. ఇండస్ట్రీల ఉన్న నా ఫ్రెండ్స్ అలాగే తోటి నటీనటులు అంతా నా పెర్ఫార్మన్స్ బాగుందని అంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది.

ప్ర. త్రివిక్రమ్,పవన్ కళ్యాణ్ వంటి స్టార్ లతో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

జ. కళ్యాణ్ గారి లాంటి పెద్ద స్టార్‌ ఇలాంటి జోనర్‌లో సినిమా చేస్తున్నారు అంటే నాకు చాలా కొత్తగా, ఎగ్జైటింగ్‌గా అనిపించింది. త్రివిక్రమ్‌గారైతే నాకంటే ఎక్కువ ఎగ్జైటింగ్‌ పర్సన్‌.ఆయన ఏం మాట్లాడినా అవి బుల్లెట్లులా పేలుతుంటాయి. ఎట్ ది సేమ్ టైం అవి చాలా విలువైన మాటలుగా అనిపిస్తాయి.ఆయన చాలా నాలెడ్జ్‌ ఉన్న వ్యక్తి, భాష, సంస్కృతి అన్నిటి మీద ఆయనకి గ్రిప్ ఉంది.

ప్ర. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లలో మీకు బాగా ఇన్స్పైరింగ్ గా అనిపించింది ఏంటి?

జ. నేను ప్రతీ సినిమాతోనూ ఎంతో కొంత నేర్చుకుంటూ ఉంటాను. త్రివిక్రమ్‌, పవన్‌ కళ్యాణ్ గారితో పనిచేసినప్పుడు చాలా ఎక్కువ నేర్చుకున్నాననే ఫీలింగ్ కలిగించింది.ముఖ్యంగా త్రివిక్రమ్‌ గారితో పనిచేయడం చాలా హ్యాపీ అనిపించింది. మలయాళం సినిమాల కథలు.. అక్కడి మనుషుల తీరును బట్టి ఉంటాయి. అవి పూర్తిగా డిఫెరెంట్ గా ఉంటాయి.వాళ్ళ సంస్కృతి కూడా వేరు. వాళ్ళ నేటివిటీ కథను మన ప్రేక్షకులకు సులభంగా రీచ్‌ అయ్యేలా మార్పులు చేయడం కష్టం. త్రివిక్రమ్ గారు కాబట్టి.. చేయగలిగారు.

ప్ర.మీ పాత్రని ఆయన డిజైన్ చేయడం.. దాని కోసం మీరు ఎలాంటి వర్కౌట్ చేయడం జరిగింది?

జ.‘ఐరన్‌ మ్యాన్‌’ మూవీలో రాబర్డ్‌ డౌనీ పాత్ర ఉంటుంది. అది నాకు ఆల్‌ టైమ్‌ ఫేవరెట్‌. అందులో వాడు నచ్చని పనులు చేస్తుంటాడు. కానీ అవి మనకు నచ్చుతాయి. ఆ పాత్రకి సిమిలర్ గా డానీ పాత్ర ఉంటుంది.ఈ సినిమా మొదలవుతుంది అనగానే డానీ పాత్రకి ఇంకా ఎవర్నీ అనుకోకపోతే నేనే చేస్తానని అడిగాను.

ప్ర.పవన్ కళ్యాణ్ వంటి స్టార్ తో పనిచేసారు. ఆయనతో మీ జర్నీ ఎలా ఉంది?

జ.నా ఎక్స్‌పోజ్‌ సినిమానే. ప్రతి పాత్ర డిఫరెంట్‌గా ఉండాలనుకుంటాను. డిఫరెంట్‌ ఆర్టిస్ట్‌లతో, కొత్త కథలు చేయాలని తహతహలాడుతుంటాను.పవన్‌ కళ్యాణ్ గారు కూడా అంతే. ఆయనతో నాకు పెద్దగా పరిచయం లేదు. కలిసింది కూడా తక్కువే. దీని షూటింగ్ టైములో ఆయన నాకు బాగా కనెక్ట్‌ అయిపోయారు.ఆయన చాలా నిజాయతీ ఉన్న వ్యక్తి.

ప్ర.మీకు ఎక్కువగా ఎలాంటి కథలు నచ్చుతాయి?

జ.నేను డిఫరెంట్ కథలు సెలెక్ట్ చేసుకుంటాననే టాక్‌ ఉంది. చాలామంది రకరకాల కారణాలతో యాక్టర్లు అవుతారు. నేను నటుడు అయ్యింది డిఫరెంట్ రోల్స్ తో ప్రేక్షకుల్ని మెప్పించాలనే. అలా ఉండడం కోసం యాక్టింగ్ లో చాలా డైనమిక్స్ నేర్చుకున్నాను.

ప్ర. ఇలాంటి జోనర్ మూవీ మీరు గతంలో చేయలేదు ఎందుకు?

జ. అసలు హీరో అంటే ఏంటి? అనేది ఈ సినిమాతోనే నేర్చుకున్నా. సినిమా మధ్యలో పాటలు, ఫైటులు ఎందుకు అనుకుంటాను. పాటలొస్తే కథ నుంచి బయటకు వచ్చేస్తాను. ఎందుకో వాటికి సింక్‌ అవ్వలేను. మాస్‌ సినిమా చేయాలని అందరూ చెబుతుంటే ఎందుకా అనుకునేవాడిని. అవి సినిమాకు ఎంత అవసరమో పవన్ కళ్యాణ్ గారిని చూశాక తెలిసింది.సినిమా వాతావరణంలో పుట్టి పెరిగిన నాకు ఏం చేసినా కొత్తగా ఉండాలనుకుంటాను. అందరిలా ఉండకూడదు అనేది నా తత్వం. తెర మీద కొత్తదనం చూడటానికే నేను థియేటరకి వెళ్తాను. థియేటర్‌లో కొత్తగా చూసింది… అంతకంటే కొత్తగా నేను చేయాలనుకుంటా. ఇప్పటి వరకూ అదే దారిలో వెళ్తున్నా. ఈ కథ విన్న తర్వాత నా జోన్‌ సినిమా అనిపించింది. అయితే సినిమా చేసిన తర్వాత ఇంతకుమించి ముందుకు వెళ్లాలి అనిపించింది. నేను ఎప్పుడు సెలెక్టివ్‌గా ఉంటాను..సాహసాలు కూడా చేస్తాను. అయితే ‘భీమ్లానాయక్‌’ చేశాక హీరోయిజం అంటే ఏంటో నాకు తెలిసొచ్చింది.

ప్ర. రీమేక్ సినిమాలు చేయడం ఎలా అనిపిస్తూ ఉంటుంది?

జ.ఒక సినిమాని రీమేక్‌ చేయాలంటే చాలా కష్టం. దాని మీద నాకూ అవగాహన ఉంది. ఎందుకంటే మా చిన్నాన్న వెంకటేష్ గారు చాలా రీమేక్‌లు చేశారు. మార్పుల చర్చలు ఎలా ఉంటాయో బాబాయ్‌ దగ్గర చూసేవాడిని. ఈ సినిమా విషయంలో మాత్రం మాకు కష్టం లేకుండా త్రివిక్రమ్‌ గారే అన్నీ చూసుకున్నారు. సో మాకు ఈజీ అనిపించింది. ఒరిజినల్‌ ఫ్లేవర్‌ను చెడగొట్టకుండా ఉన్న కథని మన వాళ్లకు నచ్చేలా ఎలా తీయాలో అలా డిజైన్ చేశారాయన. ఆ మూవీకి త్రివిక్రమ్‌ వెన్నెముక అనే చెప్పాలి. కొన్ని సీన్స్ అయితే ఒరిజినల్‌ ను మరచిపోయేలా ఉంటాయి. దానికి తగ్గట్టే సాగర్‌ తెరకెక్కించడం జరిగింది.

ప్ర.’భీమ్లా నాయక్’ లో మీ రోల్ కి ఎక్కువ డామినేషన్ ఉంటుంది కదా. కథ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది?

జ. ఇద్దరు హీరోలు స్క్రీన్ పై కనిపిస్తున్నారు అంటే.. ఒకడు మంచోడు.. మరొకడు తాగుబోతు అయితే.. చెడ్డవాడే నచ్చుతాడు. ఇక్కడా అదే జరిగి ఉంటుంది. ఇందులో డామినేటింగ్‌ ఏమీలేదు. డానీ రోల్ కోసం నేను వర్కౌట్ చేసింది ఏమీ లేదు. డానీ ఎలా ఉండాలో అలాగే ఉన్నాడు. పవన్‌ కళ్యాణ్గా గారి పాత్ర కూడా అంతే! సింపుల్‌గా ఆ పాత్రలో అలాగే సెట్ ఉండేవారాయన.

ప్ర.దర్శకుడు సాగర్ చంద్రతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? దీని సక్సెస్ క్రెడిట్ త్రివిక్రమ్, సాగర్ లలో ఎవరికి చెందుతుంది?

జ.సాగర్‌ చాలా స్ట్రెయిట్‌ ఫార్వర్డ్‌ పర్సన్‌. అతన్ని చూస్తే జెలసీ అనిపిస్తుంటుంది. ఒకేసారి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌ వంటి స్టార్లతో పనిచేసే ఛాన్స్ ఆయనకి దక్కింది. ఈ సినిమా సక్సెస్‌ క్రెడిట్‌లో ఎవరికి ఎంత అంటే ఏం చెప్పలేం. దర్శకుడిగా సాగర్‌ చేయాల్సింది చేశాడు. మాటలు, స్క్రీన్ ప్లే వరకు త్రివిక్రమ్‌ చేయాల్సింది ఆయన చేశారు.ఇది టోటల్ టీమ్‌ సక్సెస్‌. రిలీజ్ లేట్‌ అయ్యింది కానీ.. మొదటి నుండీ ఈ మూవీకి అన్నీ బాగా కుదిరాయి. పాటలు హిట్ అయ్యాయి. దాంతో మంచి బజ్‌ ఏర్పడింది.

ప్ర. మీ ఫ్యామిలీ అంతా ఈ మూవీ చూసిన తర్వాత ఎలా రియాక్ట్ అయ్యారు?

జ.నేను చేసిన డ్యాని పాత్ర చూసి నాన్న చాలా సంతృప్తి చెందారు. ఆయన అలా చెప్పడం చాలా అరుదుగా జరుగుతుంది. ‘బాహుబలి’ తర్వాత మళ్లీ ఈ సినిమాకే ఆయన చాలా గొప్పగా చెప్పారు. ఏదో ఒక రోజు పాటలు, ఫైటులు లేకుండా టాకీతోనే సినిమా తీసి హిట్‌ కొడతా అని మా నాన్నతో చెబుతుంటా. అలాంటి ప్రయత్నం చేస్తా. ఇక పై ‘అవుట్‌ అండ్‌ అవుట్‌ కమర్షియల్‌ సినిమాలు చేస్తాను’ అని సోషల్‌ మీడియాలో డిస్కషన్లు నడుస్తుంటాయి. అలాంటి చిత్రాలు చేయాలని నాకూ ఇప్పుడే తెలిసింది. ‘ఇతర ఇండస్ట్రీల్లో కథల్ని చెబుతారు. తెలుగు ఇండస్ట్రీ మాత్రం ఫిల్మ్‌ మేకింగ్‌ చెబుతుందని’ ‘వకీల్‌సాబ్‌’ రిలీజ్‌ టైమ్‌లో ఓ డిస్ట్రిబ్యూటర్‌ చెప్పారు. అప్పుడే నాకు ఇలాంటి వాటి పై ఓ అవగాహన వచ్చింది.

Read Today's Latest Interviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus