రానా-మిహికాల పెళ్లి ముహర్తం ఖరారు?

  • May 31, 2020 / 11:09 AM IST

రానా కొంత కాలంగా ప్రేమిస్తున్న తన ప్రేయసి మిహికా బజాజ్ ను పెళ్లి చేసుకొబోతున్నట్లు ఆకస్మిక ప్రకటన చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. తన ప్రేయసిని పరిచయం చేసిన కొద్దిరోజుల రోజులలోనే, కుటుంబ సభ్యుల సమక్షంలో రోకా వేడుక కూడా జరుపుకున్నారు. ఇక వీరి పెళ్లి వేడుక వీలైనంత త్వరగా పూర్తి చేయాలనీ రానా తండ్రి సురేష్ బాబు ఆలోచనలో ఉండగా, ఆగస్టులో రానా, విహికాలు పెళ్లి పీటలు ఎక్కనున్నారని తెలుస్తుంది.

ఎప్పుడో వీరి పెళ్ళి ఏర్పాట్లు మొదలు పెట్టిన సురేష్ బాబు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారని తెలుస్తుంది. ఆగస్టులో ఈ జంటను ఒక్కటి చేయాలని ఇరు కుటుంబాల సభ్యులు నిర్ణయించుకున్నారట. గతంలో వీరి వివాహం డిసెంబర్ లో ఉంటుందని వార్తలు రాగా ఇంకా ముందే వీరి పెళ్లి జరగనుంది. తాజా సమాచారం ప్రకారం ఆగస్టు 8న రానా విహీకాల పెళ్లికి ముహూర్తం కుదిరిందట. కావున మరో రెండు నెలలో రానా బ్యాచ్ లర్ లైఫ్ కి టాటా చెప్పనున్నాడని వినికిడి.

అనుకోకుండా కుటుంబ సభ్యుల ద్వారా మిహీకాతో రానాకు పరిచయడం ఏర్పడగా, అది చిన్నగా ప్రేమ వైపు దారితీసింది. మిహీకాతో తనది లవ్ యట్ ఫస్ట్ సైట్ కాదంటారు రానా. మరో వైపు రానా అరడజనుకుపైగా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన పాన్ ఇండియా మూవీ అరణ్య విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగులో ఆయన చేస్తున్న విరాట పర్వం 1992 చిత్రీకరణ దశలో ఉంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

Most Recommended Video

రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ & రేటింగ్
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus