Rana Daggubati: విదేశాల్లో రానాకు దక్కిన అరుదైన అభిమానం.. ఏమైంది.. ఎవరా అభిమాని?

ఫేవరెట్‌ హీరో వెండితెర మీద కనిపిస్తేనే మురిసిపోతుంటారు అభిమానులు. అలాంటిది ఏకంగా ఎదురుగా కనిపిస్తే.. ఎలా ఉంటుందో చెప్పండి. ఆ ఆనందాన్ని చెప్పడానికి, వివరించడానికి మాటలు చాలవు. ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అందులో ఉన్న హీరో రానా (Rana)  . ఆ అభిమాని ఎవరో తెలియదు కానీ.. ఆయన చూపించిన అభిమానం మాత్రం అదిరిపోయింది. హైదరాబాద్‌లో ఉంటే రానా.. ఎంచక్కా బైక్‌పై తిరిగేస్తుంటాడు. ఒక్కోసారి దారిలో ఎవరైనా పలకరిస్తే వారితో ఆప్యాయంగా మాట్లాడుతుంటాడు కూడా.

Rana Daggubati

ఇది మన దేశంలో మాత్రమే కాదు.. విదేశాల్లోనూ కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. అలా ఇటీవల రానా విదేశాలకు వెళ్లినప్పుడు జరిగిన సంఘటన, దానికి సంబంధించిన వీడియో గురించే ఇప్పుడు మాట్లాడుతున్నాం. ప్రస్తుతం రానా అమెరికాలో వెకేషన్‌ ఎంజాయ్ చేస్తున్నాడు. అలా చికాగోలో కారులో వెళ్తుండగా రానాను చూసిన ఓ అభిమాని కారు డ్రైవింగ్ చేస్తూనే పలకరించారు. దానికి రానా (Rana Daggubati)

కూడా హాయ్ అన్నాడు. ఆ తర్వాత తన ఫ్యాన్‌ కోసం కారు ఆపాడు.

దాంతో ఆ అభిమాని రానాను గట్టిగా హగ్ చేసుకొని ఎమోషనల్ అయిపోయారు. ఆయన ఫ్యామిలీని కూడా పలకరించి ఫొటోలు దిగారు. అప్పుడే జరిగింది అసలు ట్విస్ట్‌. మామూలుగా పేపరు మీద ఆటోగ్రాఫ్‌ అడిగే అభిమానులు ఉంటారు. కానీ రానా అభిమాని ఏకంగా తన గుండెలపై ఆటోగ్రాఫ్ చెయ్యాలని కోరారు. వద్దని చెప్పినా వినకుండా షర్ట్‌పై ఆటోగ్రాఫ్ చేయించుకున్నారు. ఆ తర్వాత తన కారుపై కూడా సైన్ చేయాలని కోరారు.

ఈ అభిమానాన్ని చూసి రానా మురిసిపోయాడు. ఈ వీడియోనే ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక రానా సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రజనీకాంత్‌ (Rajinikanth)   ‘వేట్టయాన్’  (Vettaiyan) సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా దసరా సందర్భంగా రిలీజ్‌ అవుతోంది. ఈ సినిమాతోపాటు మరికొన్ని తెలుగు సినిమాల గురించి చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇంకా ఏదీ స్టార్ట్‌ అవ్వలేదు.

డిజాస్టర్ గా మిగిలిన ప్రియదర్శి ‘డార్లింగ్’.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus