రెండేళ్ల వరకు రానా డేట్స్ ఖాళీ లేదట

నేనే రాజు నేనే మంత్రి తర్వాత దగ్గుబాటి రానా ప్రముఖ దర్శకుడు ప్రభుసాల్మన్ దర్శకత్వంలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఓ ప్రయోగాత్మక చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘అరణ్య’ అనే పేరును ఖరారు చేశారు. హిందీలో ‘హాథీ మేరీ సాథీ’ పేరుతో.. తమిళ్‌లో ‘కాదన్’ అనే పేరుతో ఈ చిత్రాన్ని మూడు భాషల్లో రూపొందిస్తున్నారు. ఇందుకోసం అడవుల్లోనే ఎక్కువగా గడుపుతున్నారు. ఈ సినిమా తర్వాత అనేక కథలను రానా లైన్లో పెట్టారు. ప్రముఖ వస్తాదు కోడి రామ్మూర్తి నాయుడుగా రానా కనిపించడానికి కసరత్తులు చేస్తున్నారు. అలాగే గుణశేఖర్ దర్శకత్వంలో “హిరణ్యకశ్యప” చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఈ రెండు ప్రాజెక్స్ట్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఇవి సెట్స్ మీదకు వెళ్ళడానికి ఏడాది పట్టేట్టు ఉంది. అంతలోపున మరో రెండు సినిమాలు కంప్లీట్ చేయడానికి డేట్స్ సర్దు బాటు చేశారు. బాలీవుడ్ డైరక్టర్ శశాంక్‌ ఖైతన్‌ ప్రస్తుతం శ్రీదేవి కూతురితో దఢక్ మూవీ చేసారు. ఇది వచ్చే నెల 20 న రిలీజ్ కానుంది. దీని తర్వాత బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ తో ‘రణ్‌భూమి’ అనే సినిమా చేయనున్నారు. ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రానా ఓ కీలక పాత్ర పోషించడానికి ఒకే చెప్పినట్లు తెలిసింది. అలాగే క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎన్టీఆర్ బయోపిక్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోల్ పోషించనున్నారు. ఇలా చేతినిండా ప్రాజక్ట్స్ తో రెండేళ్ల పాటు ఫుల్ బిజీగా ఉండనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus