మిహీకా బజాజ్ పెళ్లి డ్రస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

పెళ్లి అనేది జీవితంలో ఒకసారి మాత్రమే జరిగే తంతు. అందుకే ఎవరైనా తమకున్నంతలో ఘనంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. ఇక కోటీశ్వరులు, సెలెబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వేడుకకు సంబంధించిన ప్రతి విషయంలో గొప్పగా ఉండేలా చూసుకుంటారు. పెళ్ళిలో అందరు ఎక్కుగా ప్రస్తావించేది, వధూవరుల బట్టలు మరియు నగలు, వంటకాల గురించే. ప్రముఖుల పెళ్ళిళ్ల కోసం కోట్లు తీసుకొనే డిజైనర్స్ దిగిపోతారు. కాగా ఈనెల 8న హీరో రానా మరియు మిహికా బజాజ్ ల వివాహం ఘనంగా జరిగింది. అతి కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ వేడుకకు హాజరు కావడం జరిగింది.

కాగా ఈ వేడుకలో పెళ్లి కూతురు మిహికా బజాజ్ వేసుకున్న డ్రస్ ధర తెలిస్తే నోళ్లు వెళ్ళబెట్టాల్సిందే. ఏకంగా ఆ డ్రస్ కొరకు ఆమె రూ. 6 లక్షలు కేటాయించారని సమాచారం. ప్రముఖ డిజైనర్ అనామిక ఖన్నా ఆ డ్రస్ ని డిజైన్ చేశారట. క్రీమ్ కలర్ లెహంగా మొత్తం హ్యాండ్ మేడ్ ఎంబ్రాయిడరీ వేయించారట. గంటల తరబడి శ్రమించి తయారు చేసిన ఆ డ్రస్ ప్రత్యేకత అదేనని తెలుస్తుంది. అందుకే ఆ డ్రెస్ ధరను అంతగా నిర్ణయించారని సమాచారం.

రానా- మిహికా బజాజ్ ల పెళ్ళికి అతిథిగా హాజరైన సమంత డ్రెస్ కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. మెహందీ వేడుక రోజున సమంత వేసుకున్న డిజైనర్ వేర్, ధర అక్షరాలా 1.59 లక్షల రూపాయలు అని తెలిసింది. ఆ డ్రెస్ ని ప్రముఖ్ డిజైనర్ అర్పితా మెహతా డిజైన్ చేయడం జరిగింది. ఏది ఏమైనా రానా- మిహికా బజాజ్ పెళ్లివేడుకలో ప్రతి విషయం ప్రత్యేకత చాటుకుంటుంది. కాగా సమంత సోషల్ మీడియా వేదికగా మిహిక బజాజ్ కి తమ కుటుంబంలోకి ఆహ్వానం పలికింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

 

బజాజ్ మెహందీ ఫంక్షన్ ఫోటోలు

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25


Most Recommended Video

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ హీరోయిన్ రూప గురించి మనకు తెలియని విషయాలు..!
పోకిరి మూవీలో పూరిజగన్నాథ్ సోనూసూద్ నీ హీరోగా అనుకున్నాడట!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus