వేణు ఊడుగుల డైరెక్షన్ లో తెరకెక్కిన విరాటపర్వం సినిమాకు సంబంధించి గత కొన్ని నెలలుగా ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. సురేష్ బాబు నారప్ప, దృశ్యం2 సినిమాలను విడుదల చేసిన విధంగా విరాటపర్వం సినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది. బాహుబలి2 సినిమా తర్వాత సోలో హీరోగా సరైన సక్సెస్ లేని రానా కెరీర్ కు విరాటపర్వం సక్సెస్ కీలకమని చెప్పవచ్చు.
ఈ ఏడాది విడుదలైన భీమ్లా నాయక్ సినిమా సక్సెస్ సాధించినా ఆ సినిమా సక్సెస్ లో మేజర్ క్రెడిట్ పవన్ కళ్యాణ్ కు దక్కుతుందనే సంగతి తెలిసిందే. అయితే రానా విరాటపర్వం రిలీజ్ విషయంలో వెంకటేష్ ను ఫాలో అవుతున్నారు. సూర్యవంశం రిలీజైన రోజునే విడుదలైన భీమ్లా నాయక్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా బ్రహ్మపుత్రుడు విడుదలైన జులై 1వ తేదీన రానా నటించిన విరాటపర్వం విడుదల కానుండటం గమనార్హం.
ఈ సినిమాలో ప్రియమణి, నందితా దాస్, నివేతా పేతురాజ్ ఇతర కీలక పాత్రలలో నటించడం గమనార్హం. బాబాయ్ సక్సెస్ సెంటిమెంట్ ను రానా రిపీట్ చేస్తారేమో చూడాల్సి ఉంది. రానా ప్రస్తుతం ఒక్కో సినిమాకు 5 నుంచి 7 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే రానా రెమ్యునరేషన్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.
రానా కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. వెంకటేష్ తో కలిసి రానా ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. సీరియస్ రోల్స్ రానాకు మంచి పేరును తెచ్చిపెడుతున్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఆచార్య సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. విరాటపర్వం సినిమా ఆ సెంటిమెంట్ ను కూడా బ్రేక్ చేయాల్సి ఉంది.