Rana: పవన్ చేస్తున్నారని తెలియగానే అలా ఫీలయ్యానన్న రానా!

భీమ్లా నాయక్ సినిమాలో తమ పాత్రలకు పవన్, రానా ప్రాణం పోసి పూర్తిస్థాయిలో న్యాయం చేసిన సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు పలు ఏరియాల్లో ఇప్పటికే ఈ సినిమాలు బ్రేక్ ఈవెన్ కావడంతో నిర్మాతలకు లాభాలు వస్తున్నాయి. భీమ్లా నాయక్ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన రానా భీమ్లా నాయక్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. భీమ్లా నాయక్ సినిమాలో డానియల్ శేఖర్ పాత్ర కోసం మొదట తనను ఎంపిక చేశారని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ పాత్రలో నటిస్తారని తాను అస్సలు ఊహించలేదని రానా పేర్కొన్నారు.

నిర్మాత నాగవంశీని భీమ్లా నాయక్ రోల్ లో నటించే హీరో ఎవరని అడిగితే ఇంకా ఫైనల్ కాలేదనే సమాధానం తనకు వినిపించేదని రానా వెల్లడించారు. ఆ తర్వాత భీమ్లా నాయక్ సినిమా నుంచి నన్ను తీసేశారా అనే అనుమానం కలిగిందని రానా చెప్పుకొచ్చారు. ఆ సమయంలో భీమ్లా నాయక్ ప్రాజెక్ట్ ఆగిపోయిందేమో అని కూడా అనిపించిందని రానా వెల్లడించారు. ఆ తర్వాత భీమ్లా నాయక్ రోల్ కు పవన్ ఎంపికయ్యారని తెలిసి తాను చాలా ఎగ్జైట్ అయ్యానని ఆయన అన్నారు.

చెడ్డగా ప్రవర్తించే పాత్రలకు మంచిగా ప్రవర్తించే పాత్రలతో పోలిస్తే ఫ్యాన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతారని రానా కామెంట్లు చేశారు. తన పాత్ర ఎక్కువమందికి కనెక్ట్ కావడంతో డామినేట్ చేశానని అనిపించి ఉండవచ్చని రానా పేర్కొన్నారు. లీడర్ సినిమా సీక్వెల్ గురించి రానా మాట్లాడుతూ ఆ సినిమా ఎప్పుడు ఉంటుందో చూడాల్సి ఉందని అన్నారు. తనను కలిసిన సమయంలో శేఖర్ కమ్ముల లీడర్ సీక్వెల్ గురించి రెండుమూడు సన్నివేశాలు చెబుతారని ఆ తర్వాత మళ్లీ సైలెంట్ అవుతారని రానా కామెంట్లు చేశారు.

భీమ్లా నాయక్ సక్సెస్ రానాకు కెరీర్ పరంగా ప్లస్ అయింది. త్వరలో రానా హీరోగా తెరకెక్కిన విరాటపర్వం సినిమా రిలీజ్ కానుంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus