Rana, Miheeka: దగ్గుబాటి ఫ్యామిలీ పెద్దదవుతుంది..

సోషల్ మీడియా పుణ్యమా అని ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ అన్నీ మనకి తెలిసిపోతున్నాయి. సినిమా న్యూస్ కానీ సెలబ్రిటీలకు సంబంధించిన పర్సనల్ విషయాల గురించి కానీ ఏదైనా ఒక చిన్న విషయం బయటకి వచ్చిందంటే.. ఇక అది ఏ రేంజ్‌లో స్ప్రెడ్ అవుతుందో చెప్పక్కర్లేదు. ఇప్పుడు దగ్గుబాటి రానా ఫ్యామిలీ గురించి ఓ క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. లాక్‌డౌన్ టైంలో ప్రియురాలు మిహికా బజాజ్ మెడలో మూడు ముళ్లు వేశాడు రానా.

ఈ లవ్లీ కపుల్ హ్యాపీగా వాళ్ల లైఫ్ ఏదో వాళ్లు లీడ్ చేస్తూ.. కొద్దిరోజుల పాటు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుని.. తమ పిక్స్ అన్నిటినీ డిలీట్ చేసేశారు. దీంతో, ‘రానా, మిహికా బ్రేకప్’.. ‘విడాకులు తీసుకోబోతున్న టాలీవుడ్‌ స్టార్ కపుల్’ అంటూ థంబ్ నెయిల్స్ వైరల్ అయ్యాయి. ఈ వార్తల్ని ఇక్కడితో ఆపకపోతే కష్టం అనుకుని.. రానాతో కలిసున్న పిక్ పోస్ట్ చేసింది మిహిక. ఇక ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచిందీ జంట.. దగ్గుబాటి కుటుంబం సంతోషంతో సంబరాలు చేసుకుంటుందని..

దీనికి కారణం రానా తండ్రి కావడమేనంటూ న్యూస్ ట్రెండ్ అవుతోంది. రానా, మిహికా కపుల్ త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారని, వెరీ సూన్ దగ్గుబాటి ఫ్యామిలీ ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చెయ్యనుందని అంటున్నారు. మూవీ మొఘల్ డా.డి. రామా నాయుడు తర్వాత ఆయన తనయులు సురేష్, వెంకటేష్ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. హీరోగానే కాకుండా విలన్‌గానూ సత్తా చాటిన రానా..

సినిమా సినిమాకీ నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ‘కృష్ణం వందే జగద్గురుమ్’ లో బాబాయ్ విక్టరీ వెంకటేష్‌తో ఓ సాంగ్‌లో కనిపించిన రానా.. ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ చేశాడు. త్వరలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.. రానా తమ్ముడు అభిరామ్, తేజ దర్శకత్వంలో ‘అహింస’ మూవీతో ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది..

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus