ఆంగ్ల పత్రికవారికి వివరణ ఇచ్చిన రానా

బాహుబలి చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రానా… ఘాజి, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాలతో విజయాలను దక్కించుకున్నారు. ప్రస్తుతం హాథీ మేరె సాథి అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. థాయిలాండ్ అడవుల్లో షూటింగ్ చేశారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల కానుంది. ఈ చిత్రానికి తెలుగులో అడవి రాముడు అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ చిత్రీకరణకు కాసేపు బ్రేక్ ఇచ్చి ఎన్టీఆర్ బయోపిక్ కోసం కష్టపడుతున్నారు. ఇందులో నారా చంద్రబాబు నాయుడిగా కనిపించబోతున్నారు. ఇక ఉత్తరాది, దక్షిణాది అని తేడా లేకుండా అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్నారు.

అయితే రీసెంట్ గా ఓ జాతీయ ఆంగ్ల పత్రిక రానాను ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో తాను చెప్పింది ఒకటైతే… మరొకటి ప్రచురించారని రానా ఆవేదన వ్యక్తం చేశారు. తాను మాట్లాడిన విషయాన్ని సరిగా వినలేదని చెప్పారు. “నాకు బాలీవుడ్ లో ఏదీ ఆసక్తికరంగా లేదు” అని రానా అన్నట్టుగా సదరు పత్రిక ప్రచురించింది. దీంతో బాధపడిన రానా ట్విట్టర్ వేదికపై వివరణ ఇచ్చారు. “నేను చెప్పింది మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు సరిగా విన్నట్టు లేదు” అని ట్వీట్ చేశారు. బాలీవుడ్ లో రానాకీ మంచి అనుబంధం ఉంది.. అక్కడి ప్రముఖుల నుంచి ఫోన్ కాల్స్ రావడం వల్ల రానా స్పందించాల్సి వచ్చిందని తెలిసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus