రానా నిర్మాతగా అఖిల్ మూడో సినిమా

అక్కినేని అఖిల్ ని హలో అంటూ విజయం వరించింది. దీంతో ఉత్సహంతో మూడో సినిమాని మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్లో మరో చిత్రం చేయాలంటే బయట బ్యానర్లో కొన్ని సినిమాలు చేయమని తండ్రి నాగార్జున చెప్పడంతో అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తున్నారు. అఖిల్ తో సినిమా నిర్మించడానికి దగ్గుబాటి రానా మొందుకొచ్చారు. ప్రముఖ నిర్మాత డి రామానాయుడు తనయుడు సురేష్ బాబు నిర్మాతగా మంచి సినిమాలు నిర్మించారు. రామానాయుడు మనవుడు రానా నటుడిగా సక్సస్ అయ్యారు. ఇప్పుడు నిర్మాతగా నిరూపించుకోనున్నారు. అఖిల్ మూడో సినిమాకి నిర్మాత ఫిక్స్ అయినా డైరక్టర్ ఇంకా ఖరారు కాలేదు.

వంశీ పైడిపల్లి, కొరటాల శివ, సుకుమార్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే కొరటాల శివ, వంశీ పైడిపల్లి మహేష్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. సుకుమార్ సినిమా రంగస్థలం త్వరలో పూర్తి కానుంది. ఇదిలా ఉంటే ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడు సత్య పినిశెట్టి అఖిల్‌ను కలిసి కథ వినిపించాడని, ఆది పినిశెట్టి సోదరుడు సత్య చెప్పిన కథ అఖిల్‌ కి బాగా నచ్చిందని సమాచారం. సత్యకు ఓకే కూడా చెప్పారంట. నాగార్జున కూడా కథ విని ఒకే అంటే అధికారికంగా ప్రకటించనున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో.. ఈనెల 10న స్పష్టంకానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus