‘యజ్ఞం’ ‘ఆంధ్రుడు’ వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో హీరోగా గోపీచంద్ అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న రోజులవి. వాటి తర్వాత కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ ను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ‘రణం’ చేశాడు. ‘ఈతరం’ ఫిలిమ్స్ బ్యానర్ పై పోకిరి బాబురావు ఈ చిత్రాన్ని నిర్మించారు. కామ్న జెఠ్మలానీ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి మణిశర్మ సంగీత దర్శకుడు. 2006 ఫిబ్రవరి 10న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. అన్ సీజన్లో రిలీజ్ అయినప్పటికీ సమ్మర్ వరకు ఈ సినిమా నిలదొక్కుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఈ ఫిబ్రవరి 10 తో 18 ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 3.81 cr |
సీడెడ్ | 0.88 cr |
ఉత్తరాంధ్ర | 1.22 cr |
ఈస్ట్ | 0.71 cr |
వెస్ట్ | 0.50 cr |
గుంటూరు | 0.53 cr |
కృష్ణా | 0.63 cr |
నెల్లూరు | 0.41 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 8.69 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 2.80 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 11.49 cr (షేర్) |
‘రణం’ చిత్రానికి రూ.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఆ టైంకి గోపీచంద్ కెరీర్లో హైయెస్ట్ థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమా ఇది. ‘యజ్ఞం’ ‘ఆంధ్రుడు’ సినిమాలకి లాభాలు వచ్చాయి. అందుకే ‘రణం’ సినిమాకి మంచి బిజినెస్ జరిగింది. ఇక ఫుల్ రన్లో ఈ సినిమా రూ.11.49 కోట్ల షేర్ ను రాబట్టి.. సూపర్ హిట్ గా నిలిచింది. బయ్యర్స్ కి రూ.3.49 కోట్ల లాభాలను అందించింది ఈ మూవీ.
యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!