మంచి ఓపెనింగ్స్ ను సాధించిన ‘రణరంగం’

శర్వానంద్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘రణరంగం’. ‘స్వామీ రారా’ ఫేమ్ సుధీర్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘సితారా ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మించాడు. కళ్యాణి ప్రియదర్శన్, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఆగష్టు 15 న విడుదలైంది. ఈ చిత్రంలో శర్వానంద్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించాడు. ఇక ‘రణరంగం’ ఫస్ట్ వీకెండ్ ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 2.75 కోట్లు
సీడెడ్ – 1.23 కోట్లు
వైజాగ్ – 1.10 కోట్లు


గుంటూరు – 0.73 కోట్లు
ఈస్ట్ – 0.51 కోట్లు
వెస్ట్ – 0.47 కోట్లు


కృష్ణా – 0.55 కోట్లు
నెల్లూరు – 0.32 కోట్లు
———————————–
ఏపీ+తెలంగాణ = 7.66 కోట్లు (షేర్)
————————————-

‘రణరంగం’ చిత్రానికి 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల నుండీ 7.66 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓవర్సీస్ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కలెక్షన్లు తెలియాల్సి ఉంది. అంటే వాటితో కలిపి 9 కోట్ల వరకూ షేర్ వచ్చే అవకాశం ఉంది. లాంగ్ వీకెండ్ ను ఈ చిత్రం బాగానే క్యాష్ చేసుకుందని చెప్పాలి. వీక్ డేస్ లో కూడా ఇదే జోరు కొనసాగిస్తే.. మొదటి వారమే హిట్ స్టేటస్ సంపాదించుకునే ఛాన్స్ ఉందంటున్నారు ట్రేడ్ పండితులు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus