Ranbir, Alia: ఆమె పక్కన లేకపోతే తినడమూ మరచిపోతున్నా: రణ్‌బీర్‌

బాలీవుడ్‌లో రీసెంట్‌ అండ్‌ మోస్ట్‌ క్యూట్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు రణ్‌బీర్‌ కపూర్‌ – ఆలియా భట్‌. ‘బ్రహ్మాస్త్ర’తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ప్రేమ జంట.. ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే త్వరలో తల్లిదండ్రులు కూడా కాబోతున్నారు. ఈ నేపథ్యంలో వీరు ఎక్కడికి వచ్చినా.. వారి ప్రేమ గురించి, కుటుంబ జీవితం గురించి, పెళ్లి తర్వాత మార్పుల గురించి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో రణ్‌బీర్‌ కపూర్‌ చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

ఇద్దరూ బిజీ స్టార్లాయే.. మరి ఒకరిపై ఒకరు ఆధారపడుతుంటారా? అని ఓ రిపోర్టర్‌ రణ్‌బీర్‌ కపూర్‌ను అడిగాడు. దానికి రణ్‌బీర్‌ చెప్పిన సమాధానం మోస్ట్‌ క్యూట్‌గా అనిపించింది. దీంతో రణ్‌బీర్‌ సమాధానాన్ని నెటిజన్లు తెగ షేర్‌ చేస్తున్నారు. అంతగా ఏమన్నాడు అనుకుంటున్నారా? ‘‘నేను చాలా ఇండిపెండెంట్‌ అని గొప్పలు చెప్పుకుంటాను కానీ.. ఆలియాపై ఎక్కువ ఆధారపడుతుంటాను. ఈ మధ్య ఆమె పక్కన లేకపోతే ఏ పనీ చేయలేకపోతున్నాను’’ అంటూ ఓపెన్‌ అయ్యాడు రణ్‌బీర్‌.

అంతేకాదు ‘‘ఒక్కోసారి తినడం కూడా మానేసి ఆమె కోసం వెతుకుతున్నా’’ అంటూ ఫ్యాన్స్‌ మరింత ఎంజాయిబుల్‌ స్టఫ్‌ చెప్పాడు రణ్‌బీర్. ఆలియా ఏం చేసినా, చేయకపోయినా ఫర్వాలేదు కానీ, నా పక్కన ఎప్పుడూ కూర్చోవాల్సిందే’’ అంటూ తన ప్రేమను వ్యక్తపరిచాడు రణ్‌బీర్‌. దీంతోపాటు ఆ సమయంలో పక్కనే ఉన్న ఆలియా.. నవ్వుతూ ‘నిజమే’ అన్నట్లు తలూపుతూ ఆనందపడిపోయింది. ఆ తర్వాత రణ్‌బీర్‌ అన్నీ మర్చిపోతుంటాడని, పక్కనే ఉండి ప్రతిదీ గుర్తు చేస్తుంటానని ఆలియా చెప్పుకొచ్చింది.

దీంతో వీరి మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. క్యూట్‌ కపుల్‌ అంతకంటే క్యూట్‌గా తమ బంధం గురించి చెప్పడం అభిమానులకు ఆనందమే కదా. ప్రెగ్నెంట్‌ అయిన తర్వాత కూడా నటించిన ఆలియా.. ఇప్పుడు ‘బ్రహ్మాస్త్ర’ ప్రచారం, సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో పార్ట్‌ అవుతోంది. సినిమా మీద తమకున్న ప్రేమను అలా చూపిస్తోంది అని అభిమానులు మెచ్చుకుంటున్నారు. ఇక ఆమె ఏం చేసినా.. విమర్శించే వాళ్లు ఎప్పటిలానే విమర్శిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘బ్రహ్మాస్త్ర’ తొలి వారం పూర్తయ్యేసరికి రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసి.. బాలీవుడ్‌ ఆకలి తీర్చింది అని విమర్శకులు మెచ్చుకుంటున్నారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus