Ranbir Kapoor: టాలీవుడ్ స్టార్స్ గురించి రణ్ బీర్ అలా చెప్పారా?

టాలీవుడ్ స్టార్ హీరోలకు ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చరణ్. తారక్, బన్నీ ఇతర భాషల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. ఈ ముగ్గురు హీరోలు వేర్వేరుగా 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు. ఈ ముగ్గురు హీరోలకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఊహించని స్థాయిలో క్రేజ్ అంతకంతకూ పెరగడం గమనార్హం. టాలీవుడ్ స్టార్ హీరోలు కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాల్లో నటించడానికి కూడా ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం.

తాజాగా రణ్ బీర్ కపూర్ టాలీవుడ్ స్టార్ హీరోల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. తు ఝూతి మై మక్కార్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ రణ్ బీర్ ఈ కామెంట్లు చేయడం గమనార్హం. మార్చి నెల 8వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. గడిచిన రెండు సంవత్సరాలలో

రిలీజైన సినిమాలలో పుష్ప ది రైజ్, ఆర్ఆర్ఆర్, గంగూబాయి కతియావాడి సినిమాలు నాపై చాలా ప్రభావం చూపాయని రణ్ బీర్ అన్నారు. ఈ సినిమాలలోని బన్నీ, చరణ్, తారక్, అలియా యాక్టింగ్ నాపై చాలా ప్రభావం చూపాయని రణ్ బీర్ కామెంట్లు చేశారు. నటుడిగా నేను కూడా అలాంటి పాత్రలు చేయాలని అనుకుంటున్నానని రణ్ బీర్ వెల్లడించారు.

టాలీవుడ్ స్టార్ల గురించి రణ్ బీర్ కపూర్ పాజిటివ్ గా కామెంట్లు చేయడం ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోలను అభిమానించే ఇతర భాషల అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోలు పాన్ వరల్డ్ హీరోలుగా గుర్తింపును సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. టాలీవుడ్ స్టార్స్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus