Ranbir Kapoor: కూతురి విషయంలో కంగారు పడుతున్న రణబీర్ కపూర్!

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ గత కొన్ని సంవత్సరాల నుంచి నటి అలియా భట్ ప్రేమలో ఉంటూ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇక వీరికి పెళ్లి జరిగిన కొన్ని నెలల్లోనే పండంటి ఆడ బిడ్డకు జన్మించారు.ఇలా తనకు కూతురు పుట్టడంతో రణబీర్ కపూర్ తన పూర్తి సమయాన్ని తన భార్య కూతురుతో కలిసి తన విలువైన సమయాన్ని కేటాయిస్తూ వారితో సంతోషంగా గడుపుతున్నారు.

ఇకపోతే తాజాగా రణబీర్ కపూర్ సౌత్ అరేబియాలోని జెడ్డాలో జరిగిన రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్న రణబీర్ తన సినిమా విషయాలతోపాటు పేరేంటింగ్ హుడ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. తాను అలియా భట్ తల్లిదండ్రులుగా ఎంతో సంతోషంగా ఉన్నామని తల్లిదండ్రులుగా తమ కూతురి భవిష్యత్తు ఎలా ఉండాలో కూడా ఈయన చెప్పుకొచ్చారు. ఇక మీడియా ప్రతినిధులు రణబీర్ కపూర్ ను ప్రశ్నిస్తూ తండ్రి అయిన తర్వాత మీలో వచ్చిన మార్పు గురించి చెప్పండి అని ప్రశ్నించగా

తాను ఎందుకు ఇంత ఆలస్యంగా పెళ్లి చేసుకున్నాను అనే భావన తనలో కలిగిందని తెలిపారు.నా అతి పెద్ద అభద్రత ఏంటి అంటే నాకు 60 సంవత్సరాలు వచ్చేటప్పటికి తన పిల్లలకు 20 సంవత్సరాలు వస్తాయి. ఆ సమయంలో నేను తన పిల్లలతో కలిసి సమానంగా ఆడుకోలేక పోతాననే సందేహం నాలో వ్యక్తం అవుతుంది అంటూ ఈ సందర్భంగా ఈయన తెలిపారు. పెద్దలపట్ల గౌరవం సమానత్వం అనేది తమ తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నామని,

అదేవిధంగా మా జీవితంలో మేము నేర్చుకున్న విషయాలను తమ పిల్లలకు అందించాలని కోరుకుంటున్నాము అందుకే నేను సినిమా షూటింగ్లో ఉన్న సమయంలో ఆలియా పిల్లల కోసం కేటాయించాలని,తాను షూటింగ్లో ఉన్నప్పుడు నేను ఇంట్లో పిల్లల కోసం టైం స్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా తన రణబీర్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus