Ranbir Kapoor, Rashmika: రష్మిక ఎప్పుడు అక్కడే గడుపుతుంది: రణబీర్

నేషనల్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రష్మికకు ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె త్వరలోనే యానినల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఈమె రణబీర్ కపూర్ సరసన నటించారు.

ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు టాక్ షోలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. తాజాగా రష్మిక సందీప్ రెడ్డి రణబీర్ ముగ్గురు కూడా బాలయ్య టాక్ షోలో పాల్గొని సందడి చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బాలకృష్ణ రష్మిక గురించి సందీప్ రెడ్డి అలాగే రణబీర్ కపూర్ ని ప్రశ్నించారు.

ఒకవేళ సినిమా షూటింగ్ లేకపోతే రష్మికను కలవాలంటే మనం ఎక్కడ కలవాలి ఆమె షూటింగ్ లేకపోతే ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రణబీర్ కపూర్ సందీప్ రెడ్డి ఇద్దరు సమాధానం చెబుతూ రష్మికను మనం కలవాలి అంటే జిమ్ కి వెళ్లాలి అంటూ సమాధానం చెప్పారు. ఈమెకు కనక సినిమా షూటింగ్ లేకపోతే ఎక్కువగా జిమ్ లోనే గడుపుతూ ఉంటారని తెలియజేశారు.

ఒకవేళ షూటింగ్ లేని సమయంలో మనం రష్మికను కలవాలి అంటే జిమ్ కి వెళ్తే సరిపోతుందని అక్కడ మనకు రష్మిక దొరుకుతుంది అంటూ సమాధానం చెప్పారు. దీంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవ్వగా ఎంతోమంది అభిమానులు అసలు రష్మిక ఏ జిమ్ కి వెళ్తుంది ఆమె కోసం అక్కడ పాగా వేస్తే మనం ఆమెను కలుసుకోవచ్చు అంటూ పెద్ద ఎత్తున ఈ వ్యాఖ్యలపై నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమా షూటింగ్స్ లేకపోతే రష్మిక (Rashmika) తన ఫిట్నెస్ పై ఫోకస్ పెడుతూ ఎక్కువగా జిమ్ లోనే గడుపుతారని తెలుస్తోంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus