Ranbir Kapoor: రణ్‌బీర్‌ కపూర్‌ పై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్న నెటిజన్లు..!

ఈ ఏడాది పెళ్లి చేసుకుని ఒకటైన లవ్ బర్డ్స్ లో అలియా భట్, రణ్‌బీర్‌ కపూర్‌ కూడా ఒకరు. వీళ్ళిద్దరికీ బాలీవుడ్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.! వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు ‘బ్రహ్మాస్త్ర’ అనే భారీ బడ్జెట్ సోసియో ఫాంటసీ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’ గా విడుదల కానుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున, బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్ , నాగిన్‌ బ్యూటీ మౌనీ రాయ్‌ వంటి వారు కూడా నటిస్తున్నారు.

సెప్టెంబర్ 9న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ల జోరు పెంచారు మేకర్స్.ఈ క్రమంలో రణ్‌బీర్‌, ఆలియా భట్‌,దర్శకుడు అయాన్‌ ముఖర్జీ ఇన్‌స్టా లైవ్‌లో పాల్గొని నెటిజెన్లతో ముచ్చటించారు. ఇందులో భాగంగా ఓ నెటిజన్‌…. ‘పాన్‌ ఇండియా మూవీగా ‘బ్రహ్మాస్త్ర’ ని రిలీజ్ చేస్తున్నప్పుడు ఆ రేంజ్లో ప్రమోషన్ చేయడం లేదేంటి?’అని ప్రశ్నించాడు. ఇందుకు హీరోయిన్ ఆలియా సమాధానం చెబుతుండగా.. హీరో రణ్‌బీర్‌ మధ్యలో కలగజేసుకొని..

‘మా మూవీని ఎందుకు భారీగా ప్రమోట్‌ చేయడం లేదంటే… ఇక్కడ ఒకరు భారీగా పెరుగుతున్నారు’ అంటూ ఆలియా బేబీ బంప్‌ ను ఉద్దేశిస్తూ ఆమె వైపు చూశాడు. దీంతో ఆలియా ఒక్కసారిగా షాక్‌ అవ్వగా… ‘జస్ట్‌ జోక్‌’ అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశాడు. ఆలియా ఈ విషయాన్ని లైట్‌ తీసుకున్నా.. నెటిజన్స్‌ మాత్రం రణ్‌బీర్‌ పై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. ‘ప్రెగ్నెంట్ లేడీ పై అవేం జోకులు.. రణ్‌బీర్‌ నీకు కనీసం బుద్దుందా..?

ప్రెగ్నెంట్‌ లేడీ నీ లాంటి వాళ్ళు కూడా బాడీ షేమింగ్‌ కామెంట్స్ చేయడం ఏంటి?’ ‘ఆలియా కంటే 10 ఏళ్ళు పెద్దవాడివి..అయినా చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తున్నావ్.ఈ టైమ్‌లో కూడా ఆలియా బార్బీ బొమ్మలా కనిపించాలా?’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.ఈ టాపిక్ అయితే వైరల్ అవుతుంది మరి రణ్‌బీర్‌ ఎలా స్పందిస్తాడో చూడాలి..!

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus