Ranbir Kapoor: అభిమాని ఫోన్ విసిరేసిన రణ్ బీర్ కపూర్..వైరల్ అవుతున్న వీడియో

అభిమానుల పై మండిపడటం, ఫోన్లు విసిరేయడం, కొట్టడం అంటే టక్కున అందరికీ స్టార్ హీరో బాలయ్యే గుర్తుకొస్తాడు. సెల్ఫీ తీసుకోవడానికి అభిమానులు బాలయ్య వద్దకు వెళ్లారు అంటే ఇక అయిపోయినట్టే.. దెబ్బలు తినకుండా తిరిగొస్తారన్న గ్యారెంటీ ఉండదు. ఇలాంటివి చాలా సందర్భాల్లో జరిగాయి.. జరుగుతూనే ఉన్నాయి కూడా..! స్టార్లు ఎదురుగా ఉంటే అభిమానులు .. వెంటనే ఓ సెల్ఫీ తీసుకోవాలని తాపత్రయపడతారు. అది వారికి ఒక క్రేజీ ఫీలింగ్. అయితే ఒక్కరిని సెల్ఫీ తీసుకోవడానికి అంగీకరిస్తే వరుసగా జనాలు వస్తూనే ఉంటారు.

అప్పుడు భద్రతా సిబ్బందికి వారిని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. అప్పుడు తొక్కిసలాటలు కూడా జరుగుతుంటాయి. అందుకే సెలబ్రిటీలు జనారణ్యంలో ఉన్నప్పుడు ఫోటోలు తీసుకోవడానికి సముఖత చూపరు. ఇదిలా ఉండగా.. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ లో కూడా బాలయ్య పూనాడట. ఇది మన నెటిజన్లు అనుకుంటున్న మాట. ఇటీవల రణబీర్ ఓ పబ్లిక్ ఈవెంట్ కు వెళ్ళాడు. అతన్ని చూడగానే అభిమానులు ఎగబడ్డారు.

ఈ క్రమంలో రణబీర్ తో సెల్ఫీ దిగేందుకు ఓ అభిమాని మొబైల్ తీసుకొని సెల్ఫీ తీసుకోవడానికి ట్రై చేశాడు. మొదట రణ్ బీర్ ఏమీ అనలేదు. కానీ ఆ అభిమాని ఫోటో సరిగ్గా రాలేదు అని మళ్ళీ మళ్ళీ క్లిక్ చేస్తూ ఉన్నాడు. దీంతో రణ్ బీర్ సహనం కోల్పోయి ఫోన్ తీసుకుని విసిరేశాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.మీరు కూడా ఓ లుక్కేయండి :

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus