ఇండియన్ మైథాలజీపై ఆధారంగా రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ “రామాయణం” (Ramayana) సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడిగా, యష్ (Yash) రావణుడిగా కనిపించనుండటంతో భారీ స్థాయిలో పాన్ ఇండియా లోకల్ మార్కెట్లను టార్గెట్ చేస్తున్నారు. నితీష్ తివారి (Nitesh Tiwari) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో సాయి పల్లవి (Sai Pallavi) సీతగా, మరో ప్రముఖ నటుడు హనుమంతుడిగా నటిస్తుండటం విశేషం. ఇదే సమయంలో సినిమాపై వచ్చిన తాజా అప్‌డేట్ మాత్రం అందరిలో ఆసక్తిని రేకెత్తించింది.
ఇందులో రణబీర్, యష్ కలిసి కనిపించే సీన్లు తక్కువగా ఉండనున్నట్లు సమాచారం. దర్శకుడు నితీష్ తివారి వాల్మీకి రామాయణానికి కట్టుబడి పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది కథా నిర్మాణ పరంగా సాహసోపేతమైన, కానీ బలమైన నిర్ణయంగా భావిస్తున్నారు పరిశీలకులు. రావణుడు సీతను అపహరించిన తర్వాతే రాముడు అతడిని గుర్తిస్తాడు. అప్పటి వరకు వారి ప్రయాణాలు వేర్వేరుగా సాగుతాయి.
ఈ విభిన్న దృక్పథాలపై సినిమాని ఫోకస్ చేయడమే కాకుండా, తుదిభాగంలో వారి కలయికకు మరింత బలాన్ని చేకూర్చే విధంగా కథను నిర్మించడం దర్శక పరిపక్వతకు నిదర్శనమని అంటున్నారు. ప్రేక్షకులకు ఇది స్టార్ల కలయిక కంటే కథపై ఎక్కువగా కనెక్ట్ అయ్యేలా మారవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో భారీ సెట్స్‌లో చిత్రీకరణ జరుగుతోంది.
యష్ – సన్నీ డియోల్ (Sunny Deol) , సాయి పల్లవి – యష్ మధ్య కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. తొలి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027లో విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. ఒకదానిపై ఆధారపడకుండా కథానుసారం పాత్రల అభివృద్ధి, వేర్వేరు మార్గాల్లో వారి బలాన్ని నిరూపించనున్నారట. ఇక ఈ రామాయణాన్ని (Ramayana) ఓ కొత్త తరం విజువల్ వండర్ గా ప్రజెంట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.