Bellamkonda Sai Sreenivas: పెళ్ళి గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫన్నీ కామెంట్స్ వైరల్!
- May 23, 2025 / 08:50 AM ISTByPhani Kumar
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) ప్రధాన పాత్రలో ‘భైరవం’ (Bhairavam) అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. విజయ్ కనకమేడల (Vijay Kanakamedala) దీనికి దర్శకుడు. మంచు మనోజ్ (Manchu Manoj) , నారా రోహిత్ (Nara Rohith) వంటి హీరోలు కూడా కీలక పాత్రలు పోషించారు. మే 30న ఈ సినిమా విడుదల కానుంది. తమిళ స్టార్ దర్శకుడు శంకర్ (Shankar) కూతురు అయినటువంటి అధితి శంకర్ (Aditi Shankar) ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమవుతుంది. ప్రమోషన్స్ లో భాగంగా టీం హుషారుగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది.
Bellamkonda Sai Sreenivas

కచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అంటూ వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో హీరోలు, దర్శకుడు కలిసి సుమతో (Suma Kanakala) చేసిన ఫన్నీ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా ‘పెళ్లి గురించి మీ అభిప్రాయం ఏంటి అంటూ యాంకర్ సుమ… బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను ప్రశ్నించింది. అందుకు పక్కనే ఉన్న దర్శకుడు విజయ్ కనకమేడల ‘అంతా డాడీయే చూసుకుంటారండీ’ అన్నట్టు చమత్కారంగా చెప్పాడు.

అయితే దీనికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ‘అదొక్కటీ నా ఇష్టం అని చెప్పారు’ అంటూ పలికాడు. ఇంతలో మంచు మనోజ్ ఇన్వాల్వ్ అయ్యి.. ‘కాకపోతే నువ్వు తెల్లారి లేస్తే మర్చిపోతున్నావ్ కదా తమ్ముడు.. రోజుకో పెళ్లి అంటే కష్టం’ అంటూ సెటైర్ విసిరాడు. దీనికి సాయి శ్రీనివాస్ ఏమాత్రం తగ్గకుండా.. ‘కొంతమంది హీరోల స్ఫూర్తితో 2,3 పెళ్ళిళ్ళు చేసుకోవాలని అనుకుంటున్నాను’ అంటూ మనోజ్ కే పంచ్ వేశాడు. దీంతో అంతా సరదాగా నవ్వుకున్నారు.
పాదాలను ముద్దాడుతూ.. గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం..!
“కొంత మంది హీరోలని చూసి inspire అయ్యి రెండు మూడు పెళ్ళిళ్ళు చేస్కుందాం అనుకుంటున్నాను” – #BellamkondaSreenivas#Bhairavam pic.twitter.com/e0SIZMwdiG
— Daily Culture (@DailyCultureYT) May 22, 2025















